Corona Virus: కరోనా కలవరం.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి కరోనా పాజిటీవ్

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లత్ కరోనా బారిన పడ్డారు. మంగళవారం రోజున తనకు జరిగిన పరీక్షల్లో కొవిడ్ పాజిటివ్ గా వచ్చినట్లు ఆయన ట్వీట్ చేశారు. వ్యాధికి సంబంధించి స్పల్ప లక్షణాలున్నాయని.. ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉన్నానని తెలిపారు.

Corona Virus: కరోనా కలవరం.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి కరోనా పాజిటీవ్
Corona Virus

Updated on: Apr 04, 2023 | 5:40 PM

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లత్ కరోనా బారిన పడ్డారు. మంగళవారం రోజున తనకు జరిగిన పరీక్షల్లో కొవిడ్ పాజిటివ్ గా వచ్చినట్లు ఆయన ట్వీట్ చేశారు. వ్యాధికి సంబంధించి స్పల్ప లక్షణాలున్నాయని.. ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉన్నానని తెలిపారు. వైద్యుల సూచన మేరకు కొద్ది రోజుల పాటు ఇంటి నుంచే విధులు నిర్వహిస్తానని తెలిపారు. ప్రజలు కూడా కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అలాగే రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే కి కూడా కరోనా సోకింది.

ఇదిలా ఉండగా..మంగళవారం రోజున కొత్తగా 3,308 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. యాక్టివ్ కేసులు 21.279కి పెరిగాయని తెలిపింది. కొత్తగా 9 మరణాలతో మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 5,30,901కి చేరినట్టు పేర్కొంది. మరోవైపు రాబోయే రోజుల్లో కరోనా కేసులు ఒక్కసారిగా పెరుగుతాయని.. అందరూ మూస్కులు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..