Rajasthan Election Result 2023: రాజస్థాన్‌లో చెయ్యి జారిన అధికారం.. కాంగ్రెస్ పార్టీ పతనానికి కారణాలు ఇవే!

|

Dec 03, 2023 | 3:41 PM

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల 2023 ట్రెండ్‌ల ప్రకారం, భారతీయ జనతా పార్టీ పూర్తి మెజారిటీతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా కదులుతోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మాంత్రికుడిగా పేరొందిన అశోక్‌ గెహ్లాట్ మ్యాజిక్‌ ఫలించేలా కనిపించడం లేదు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో లీకేజీలు, లాల్ డైరీ వంటి అంశాలు కాంగ్రెస్ ఫలితాలపై ప్రభావితం చేసినట్లు కనిపిస్తున్నాయి.

Rajasthan Election Result 2023: రాజస్థాన్‌లో చెయ్యి జారిన అధికారం.. కాంగ్రెస్ పార్టీ పతనానికి కారణాలు ఇవే!
Ashok Gehlot
Follow us on

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల 2023 ట్రెండ్‌ల ప్రకారం, భారతీయ జనతా పార్టీ పూర్తి మెజారిటీతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా కదులుతోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మాంత్రికుడిగా పేరొందిన అశోక్‌ గెహ్లాట్ మ్యాజిక్‌ ఫలించేలా కనిపించడం లేదు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో లీకేజీలు, లాల్ డైరీ వంటి అంశాలు కాంగ్రెస్ ఫలితాలపై ప్రభావితం చేసినట్లు కనిపిస్తున్నాయి. వీటిని బీజేపీ ఎన్నికల ప్రచారంలో ప్రధాన ఆస్త్రాలుగా వాడుకుని, 5 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో పునరాగమనం చేసింది.

రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో, ప్రధాని నరేంద్ర మోదీ పేపర్ లీక్, రెడ్ డైరీ, అవినీతి, మోదీ హామీ, మహిళలపై నేరాలు, శాంతిభద్రతలను గట్టిగానే లేవనెత్తారు బీజేపీ నేతలు. ఎన్నికల సంవత్సరంలో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ఒకదాని తర్వాత ఒకటి ఎత్తుగడ వేసింది. ఆరోగ్య బీమా పరిమితిని రూ.50 లక్షలకు పెంచుతామని హామీ, చౌక సిలిండర్లు సహా అన్ని ప్రలోభాల వాగ్దానాలు పేపర్ లీక్, రెడ్ డైరీ, అవినీతి ఆరోపణలతో కప్పివేయాలని ప్రయత్నించారు. అయ్యినప్పటికీ రాజస్థాన్ ప్రజలు అనుహ్య తీర్పునిచ్చారు.

రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ బలంగా లేవనెత్తిన అంశాల్లో పేపర్ లీక్ అంశం ఒకటి. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన అన్ని కుంభకోణాలపై విచారణ జరిపి దోషులను కటకటాల వెనక్కి పంపిస్తామని ప్రజలకు చెప్పారు. సీఎం అశోక్ గెహ్లాట్ తనను తాను మాంత్రికుడినని అంటున్నారని, అయితే తన మాయాజాలంతో రాష్ట్రంలో అవినీతి భ్రమను వ్యాపింపజేశారని ఆరోపించారు. పేపర్ లీక్ కావడం సర్వసాధారణమైపోయి దానికి రాజకీయ రక్షణ లభించింది. పెద్ద పెద్ద కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లపై దాడులు చేస్తే ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉండే వ్యక్తుల పేర్లు వెలుగులోకి వస్తాయని ప్రధాని మోదీ లేవనెత్తారు.

రాజస్థాన్ రాజకీయాల్లో లాల్ డైరీ వ్యవహారం కొత్త కాదు. ఇది చాలా కాలంగా ప్రస్తావనకు వచ్చినప్పటికీ, ఈ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ దీనికి పెద్ద ఎత్తున ఊతం ఇచ్చారు. రాజస్థాన్ ప్రభుత్వం నుండి తొలగించిన మంత్రి రాజేంద్ర గూడా కూడా ఎమ్మెల్యేల గుర్రపు వ్యాపారానికి సంబంధించిన ఖాతా గురించి మాట్లాడాడు. ఈ రెడ్ డైరీని ప్రస్తావిస్తూ, ఈ డైరీ పేజీలు తెరవబడుతుంటే, మాంత్రికుడి ముఖాలు ఎగిరిపోతున్నాయని ప్రధాని మోదీ అన్నారు. గత ఐదేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం నీరు, అడవులు, భూములను ఎలా అమ్ముకుందో లాల్ డైరీలో స్పష్టంగా రాసి ఉందని ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్రంలో అక్రమ మైనింగ్ తంతులను ఎవరికి అనుసంధానం చేస్తున్నారో ఎవరికీ దాచలేదు.

ఈ అంశాలే కాకుండా రాజస్థాన్‌లో కాంగ్రెస్‌లో వర్గపోరు కూడా కనిపించింది. సీఎం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య తలెత్తిన గొడవలు కూడా కాంగ్రెస్ పార్టీ పతనానికి కారణమయ్యాయి. దీని రాష్ట్రంలోని పార్టీ కార్యకర్తలను కూడా ప్రభావితం చేసింది. ప్రజల్లోకి కూడా తప్పుగా వెళ్లింది. ఎన్నికలకు ముందు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీలు వీరిద్దరినీ కలిపే ప్రయత్నం చేసినా.. ‘మనం కలిసి ఉన్నాం’ అనే సందేశం కూడా ఇచ్చినా అది ఎన్నికల ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది.

రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో, ఉదయపూర్‌లోని కన్హయ్యాలాల్ హత్య కేసు అంశాన్ని బీజేపీ బలంగా లేవనెత్తింది. రాష్ట్రం గెలవాలంటే ముందుగా మేవార్ గెలవాలని, ఉదయపూర్ మార్వార్ లో ఉందని అంటున్నారు. కన్హయ్యాలాల్ హత్య కేసుకు సంబంధించి, కాంగ్రెస్ ప్రభుత్వ లా అండ్ ఆర్డర్‌పై బీజేపీ తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తింది. అశోక్ గెహ్లాట్ కూడా ఈ ఉచ్చులో చిక్కుకున్నారు.

ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా ఈడీ రెండు రాష్ట్రాల్లోకి కూడా ప్రవేశించింది. రాజస్థాన్‌లో పేపర్ లీక్ కేసులో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోటసార, కాంగ్రెస్ అభ్యర్థి ఓంప్రకాష్ హుడ్లా ఇళ్లపై ఈడీ దాడులు చేసింది. కాంగ్రెస్ కూడా ఎన్నికల ప్రచారంలో ఈ అంశాన్ని లేవనెత్తింది. ఇదే అంశంపై మీడియాలో సీఎం అశోక్ గెహ్లాట్ మాట్లాడిన మాటలు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా మారాయి. ఇదే రాజస్టాన్‌లో హస్తం నుంచి బీజేపీ చేతిలోకి వెళ్లింది అధికారం.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ ఛేయండి…