Uttarakhand Tunnel: ఒక్క ఉత్తరమే సొరంగంలో వాళ్ల ప్రాణాలు కాపాడిందా.? వీడియో..

ఉత్తరాఖండ్‌లోని ఉత్తర్‌కాశీలో సిల్‌క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు సొరంగంలో కార్మికులు ఏ విధమైన ఇబ్బందులు పడ్డారు? గుండె ధైర్యంతో ఎలా కలిసికట్టుగా ఉన్నారు వంటి విషయాలను వీడియోలో ఆ వ్యక్తి వివరించారు. వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సొరంగ ప్రమాదంలో చిక్కుకున్న కార్మికుడు తీసిన వీడియోలో భారీ యంత్ర సామగ్రి కనిపిస్తోంది. వాటితో పాటు టన్నెల్‌లో కార్మికులందరూ కలిసికట్టుగా ఉన్న సీన్లు కనిపిస్తున్నాయి.

Uttarakhand Tunnel: ఒక్క ఉత్తరమే సొరంగంలో వాళ్ల ప్రాణాలు కాపాడిందా.? వీడియో..

|

Updated on: Dec 03, 2023 | 4:20 PM

ఉత్తరాఖండ్‌లోని ఉత్తర్‌కాశీలో సిల్‌క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు సొరంగంలో కార్మికులు ఏ విధమైన ఇబ్బందులు పడ్డారు? గుండె ధైర్యంతో ఎలా కలిసికట్టుగా ఉన్నారు వంటి విషయాలను వీడియోలో ఆ వ్యక్తి వివరించారు. వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సొరంగ ప్రమాదంలో చిక్కుకున్న కార్మికుడు తీసిన వీడియోలో భారీ యంత్ర సామగ్రి కనిపిస్తోంది. వాటితో పాటు టన్నెల్‌లో కార్మికులందరూ కలిసికట్టుగా ఉన్న సీన్లు కనిపిస్తున్నాయి. ఈ వీడియోను చూస్తే సొరంగంలో కార్మికులు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వారు ధైర్యంగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. కార్మికులంతా ఒకే చోట నిద్రచేసినట్లుగా తెలుస్తోంది. దిగులు చెందాల్సిన అవసరం లేదని తమను తప్పక రక్షిస్తారని త్వరలో తాము బయటపడతామని ఒకరికొకరు ధైర్యం చెప్పుకోవడం వీడియోలో తెలుస్తోంది. గతంలో కార్మికులు ముందుగా నీటిపైపుల ద్వారా తమ సమాచారాన్ని అధికారులకు తెలిపినట్లుగా ఆ ప్రమాదంలో చిక్కుకున్న సంతోష్‌ అనే ఓ కార్మికుడు తెలిపారు. సొరంగంలో పడి ఉన్న రెండు నీటిపైపుల్లో ఓ ఉత్తరం పెట్టామనీ తర్వాత పైపులను బిగించి మోటర్‌కు అమర్చి స్టార్ట్‌ చేశామనీ తద్వారా నీళ్లతో పాటు ఉత్తరం కూడా బయటకు వెళ్లిందని దానిని చూసిన అధికారులు సొరంగం లోపల మేమంతా బతికి ఉన్నట్లు తెలుసుకున్నారనీ చెప్పారు. ఫలితంగా అధికారులు తమకు ఆహార పదార్థాలు, ఆక్సిజన్‌ పంపించారనీ దాంతో తాము 10 రోజుల పాటు ప్రాణాలతో ఉండగలిగాం అని ఆ కార్మికుడు ఓ వీడియోలో వివరించారు. వీడియోను సొరంగంలో ఉన్న సమయంలో ఓ కార్మికుడు చిత్రీకరించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.

Follow us