Rajasthan Accident: మరో ఘోర రోడ్డుప్రమాదం.. ఆగివున్న ట్రక్కును ఢీకొన్న టెంపో ‌.. 18 మంది మృతి

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫలోడిలో టెంపో ట్రావెలర్, ఆగివున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 18 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఫలోడిలోని మటోడా గ్రామం వద్ద ఆగి ఉన్న ట్రక్కును వేగంగా దూసుకొచ్చిన టెంపో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 18 మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. స్థానికుల సాయంతో క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.

Rajasthan Accident: మరో ఘోర రోడ్డుప్రమాదం.. ఆగివున్న ట్రక్కును ఢీకొన్న టెంపో ‌.. 18 మంది మృతి
Rajasthan Accident

Updated on: Nov 02, 2025 | 9:33 PM

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫలోడిలోని మటోడా ప్రాంతంలో ఆదివారం (నవంబర్ 2)న ఆగివున్న ట్రక్కును ట్రావెలర్ టెంపో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 18 మంది మరణించగా, అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. యాత్రికులతో నిండిన టెంపో ట్రావెలర్ ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా పోలీసులు తెలిపారు. వాహనంలో ఉన్నవారంతా జోధ్‌పూర్‌లోని సుర్‌సాగర్‌ కు చెందిన వారిగా గుర్తించారు. వీరంతా బికనీర్‌లోని కొలాయత్ ఆలయ దర్శనానికి వెళ్లారు. దైవ దర్శనానంతరం తిరిగి ఇంటికి వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జోధ్‌పూర్‌కు తిరిగి వెళ్తున్న టెంపో ట్రావెలర్ మటోడా గ్రామ సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రైలర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వాహనం ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. అనేక మంది ప్రయాణికులు లోపల చిక్కుకున్నారు. రాత్రి వేళ కావటం, డ్రైవర్‌ అతివేగం కారణంగానే ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. వాహనం హై స్పీడ్‌తో వెళ్తుండటంతో డ్రైవర్ ఆగిపోయిన ట్రైలర్‌ను గమనించలేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. స్థానికులు ఇతర వాహనదారులు సంఘటనా స్థలానికి చేరుకుని అత్యవసర సేవలు వచ్చేలోపు బాధితులను బయటకు తీయడంలో సహాయపడ్డారు. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. జరిగిన ప్రమాదంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

ఫలోడిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అనేక మంది ప్రాణాలు కోల్పోవడం పట్ల ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్, ఇతర సీనియర్ అధికారులతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. గాయపడిన వారిని తక్షణ చికిత్స కోసం గ్రీన్ కారిడార్ ద్వారా ఆసుపత్రులకు తరలించాలని ఆదేశించారు. ఈ సంఘటనలో గాయపడిన వారందరికీ సాధ్యమైనంత వరకు మెరుగైన వైద్యం అందిచాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి…