సంక్రాంతి సమయంలో రైల్వే అధికారులు కీలక ప్రకటన జారీ చేశారు. ఈరోజు మకరసంక్రాంతి పర్వదినాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. మకర సంక్రాంతి పండుగను దేశంలోని అనేక ప్రాంతాలలో జనవరి 15 అంటే శనివారం కూడా జరుపుకుంటున్నారు. సనాతన ధర్మంలో ఈ పండుగకు చాలా ప్రత్యేకత ఉంది. భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో విభిన్న ఆచారాలతో జరుపుకుంటారు. మకర సంక్రాంతి రోజున గాలిపటాలు కూడా ఎగరవేస్తుంటారు. పండుగ రోజు గాలిపటాలు ఎగురవేయడంపై భారతీయ రైల్వే హెచ్చరిక జారీ చేసింది. రైల్వే లైన్ చుట్టూ గాలిపటాలు ఎగురవేయవద్దని.. ఇలా చేయడం వల్ల అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉందని రైల్వేశాఖ ప్రజలను హెచ్చరించింది.
విద్యుత్తుతో నడిచే భారతీయ రైల్వే రైళ్లు 25 వేల వోల్ట్ల కేబుల్ నుండి శక్తిని కలిగి ఉంటుందని తెలిపింది. రైలు మార్గానికి సమీపంలో గాలిపటాలు ఎగురవేస్తున్నప్పుడు వారి మాంజా 25 వేల వోల్ట్ కేబుల్‌తో తాగిలితే బలమైన విద్యుత్ షాక్‌కు కారణమవుతుందని రైల్వే తెలిపింది. ఇది మాత్రమే కాదు.. గాలిపటాలు ఎగురవేస్తున్నవారు దీని వల్ల చాాలా సార్లు చనిపోయే ప్రమాదం కూడా ఉందని తెలిపింది.
రైల్వే అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మకర సంక్రాంతి పండుగ సందర్భంగా నార్త్, సౌత్ వెస్ట్రన్ రైల్వేలోని చాలా ప్రాంతాల్లో గాలిపటాలు ఎగురవేయడం జరుగుతుంది. నార్త్ వెస్ట్రన్ రైల్వేలోని చాలా ప్రాంతాలలో విద్యుద్దీకరించబడిన రైలు విభాగాలు ప్రారంభించబడ్డాయి. రైలు మార్గానికి సమీపంలో నివసించే సామాన్య ప్రజలు గాలిపటాలు ఎగురవేసేటప్పుడు తమను, తమ పిల్లలను రైల్వే లైన్ దగ్గరకు రానివ్వవద్దని వాయువ్య రైల్వే విజ్ఞప్తి చేశారు. హైస్పీడ్ రైళ్లు ఏ వైపు నుంచి వచ్చినా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. దీంతో పాటు గాలిపటం మంఝా రైలు తీగలకు తగిలితే విద్యుత్ షాక్ కూడా తగులుతుందని తెలిపారు.
“मकर संक्रांति यानि पतंगबाजी की खुशी”
रेलवे पटरियों से बचें, और अपनी खुशियों को ऊंची उड़ान भरने दें! pic.twitter.com/FzxzuzVYle
— North Western Railway (@NWRailways) January 14, 2022
రైల్వే ప్రాంగణం/రైల్వే ట్రాక్‌పై అనధికారిక ప్రవేశం ప్రమాదకరమే కాకుండా శిక్షార్హమైన నేరమని వారు తెలిపారు. రైల్వే చట్టం ప్రకారం, రైల్వే పరిమితుల్లోకి అనధికారికంగా ప్రవేశిస్తే రూ. 500 వరకు జరిమానా విధించవచ్చు.
ప్రయాణీకుల భద్రతతో పాటు, ఇతర వ్యక్తుల భద్రత కోసం భారతీయ రైల్వే అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ప్రజల జీవితాలు సురక్షితంగా ఉండేలా రైల్వే ప్రమాదాలను అదుపులో ఉంచాలని రైల్వే శాఖ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది.
ఇవి కూడా చదవండి: Video: యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్న ‘బేబీ షార్క్’ వీడియో..10 మిలియన్ల వ్యూస్ క్రాస్.. మీరు చూశారా..
Gmailలో ఈ ఫీచర్‌ని ఎప్పుడైనా ఉపయోగించారా.. ఇందులో నుంచి సీక్రెట్ ఇమెయిల్ పంపవచ్చు తెలుసా..