Indian Railway: కేంద్ర ప్రభుత్వ ప్రైవేటైజేషన్ పాలసీలో భాగంగా ఒక్కొక్క ప్రభుత్వం సంస్థ మూత పడిపోతోంది. తాజాగా ఇండియర్ రైల్వే బోర్డు కీలక ప్రకటన విడుదల చేసింది. భారతీయ రైల్వే స్టేషన్ల అభివృద్ధి సంస్థ(ఐఆర్‌ఎస్‌డీసీ)ను మూసేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే రైల్వేలో ప్రైవేటు భాగస్వామ్యం పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రైల్వే స్టేషన్లను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం, ప్రైవేటు రైళ్లను నడపడం జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థల హేతుబద్ధీకరణలో భాగంగా పలు సంస్థలను మూసేయడం లేదా ఇతర సంస్థల్లో విలీనం చేయాలని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనల మేరకు రైల్వే బోర్డు ఐఆర్‌ఎస్‌డీసీ ను మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. ఆ సంస్థ బాధ్యతలను ఇకపై ఆయా రైల్వే జోన్లకు అప్పగిస్తున్నట్లు బోర్డు తెలిపింది.
Also read:
Telangana News: ఇదేం పిట్టరా బాబోయ్.. హెల్మెట్ ఉంటేనే పెరట్లోకి వెళ్లాలి.. లేదంటే అంతే సంగతి..!
TDP vs YCP: మంగళగిరి టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు దీక్ష.. అనుమతి ఇచ్చిన పోలీసులు..