#Rahul tweets కలకలం రేపుతున్న రాహుల్ ట్వీట్

ఒకవైపు కరోనా వైరస్ విజృంభణతో యావత్ దేశం కలవరపడుతుంటే సంక్షోభ సమయంలోను విమర్శలకే పరిమితమైన రాహుల్ గాంధీ ట్వీట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

#Rahul tweets కలకలం రేపుతున్న రాహుల్ ట్వీట్

Edited By:

Updated on: Mar 24, 2020 | 5:25 PM

Rahul Gandhi tweet goes viral: ఒకవైపు కరోనా వైరస్ విజృంభణతో యావత్ దేశం కలవరపడుతుంటే సంక్షోభ సమయంలోను విమర్శలకే పరిమితమైన రాహుల్ గాంధీ ట్వీట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దేశంలో కరోనా వైరస్ వ్యాపించకుండా నియంత్రించడంలో విఫలమైన మోడీ ప్రభుత్వం.. ప్రజలను చప్పట్లు కొట్టాలంటూ పురిగొల్పడం ఏంటని రాహుల్ గాంధీ తన ట్వీట్ లో విమర్శించారు. ఈ ట్వీట్ ఇపుడు వైరల్ అయింది.

ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేలా దేశాన్ని రెడీ చేయలేకపోవడం వెనుక యాభై ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ నేతల పాత్ర ఏమీ లేదా రాహుల్ జీ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు. చప్పట్ల వెనుక ఉద్దేశం ఎపిడమిక్ పీరియడ్ లో తమ పాత్రని బాధ్యత తో నిర్వహిస్తున్న సిబ్బందికి అభినందలు తెలపడమని.. అది క్కూడా అర్థం చేసుకోలేరా అని ప్రశ్నిస్తున్నారు. కొందరైతే తమరు ఇటలీకి వెళ్లిపోండి రాహుల్ జీ అని సలహాలు ఇస్తున్నారు. మొత్తానికి సంక్షోభ సమయంలో సహకరించకపోయినా సరే కానీ విమర్శలు చేయొద్దని చెబుతున్నారు.