కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఫుల్ జోష్‌తో కొనసాగుతుంది. ఈ యాత్ర మొదలైనప్పటి నుంచి ప్రతిపక్షాల మీద విమర్శలు గుప్పిస్తున్నారు. అలాగే ఈ యాత్రలో రాహుల్ మీసం తిప్పి అందరి దృష్టిని ఆకర్షించారు. రాహుల్‌గాంధీ జోడోయాత్రతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. క్యాడర్ నుంచి పెద్ద నాయకుల దాక అందరిలో ఉషారు కనిపిస్తోంది. ఏ రాష్ట్రంలో యాత్ర చేసిన అక్కడి పరిస్థితులను బట్టి ప్రసంగాలు జోరుగా సాగుతున్నాయి. అలాగే అక్కడి పార్టీల మీద పవర్ ఫుల్ పంచులతో విరుచుకుపడుతున్నారు. అక్కడి సంసృతులు, సాంప్రదాయాలు తెలుసుకొని మరి కలిసిపోతున్నారు. తాజాగా ఆయన తన బాక్సర్ విజయేందర్ సింగ్‌తో కలిసి మీసాలు మెలితిప్పారు. అయితే రాహుల్ గాంధీ గడ్డం, మీసాలు పెంచడంతో ఇరాక్ మాజీ నియంత సద్దాం హుస్సేన్ లా ఉన్నారంటూ అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. విమర్శలను పట్టించుకోకపోవడమే కాకుండా రాహుల్ మీసాలు మెలితిప్పారు.ఈ ఫొటోను రాహుల్ గాంధీ తన ట్విట్టర్ ఖాతాలోనూ పోస్ట్ చేశారు.
ఇక యాత్రలో మధ్యప్రదేశ్ రైతులు, కార్మికులు, విద్యార్థి సంఘాలతో పాటు అన్ని వర్గాల ప్రజలు రాహుల్ ను కలుస్తున్నారు. ఇక గత సెప్టెంబర్ 7వ తేదీన తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైన భారత్ జోడో పాదయాత్ర కేరళ, కర్ణాటక, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రలలో పూర్తి చేసుకుని మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశించింది. వచ్చే ఏడాది మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో పాదయాత్రతో రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో కొత్త ఉషారు కనిపిస్తోంది.
मूछों पर ताव, बाज़ुओं में दम,
फौलादी इरादे, जोशीले कदम! pic.twitter.com/RzRAvv0sLm— Rahul Gandhi (@RahulGandhi) November 25, 2022
बॉक्सिंग रिंग के अजेय योद्धा @boxervijender आज आपने #BharatJodoYatra में सड़क पर उतरकर खेत-खलिहान और युवाओं की आवाज़ को ताकत दी है।
शुक्रिया आपका…?? pic.twitter.com/4oZOFqPdp9
— Congress (@INCIndia) November 25, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..