‘అబ్బే ! ప్చ్ !’ నిర్మలమ్మ బడ్జెట్ పై రాహుల్ పెదవి విరుపు !

ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు సమర్పించిన బడ్జెట్ పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పెదవి విరిచారు. ఈ ప్రసంగంలో (బడ్జెట్లో) పస ఏమీ లేదన్నారు. మరీ ఎక్కువగా.. ఆర్భాటంగా మాట్లాడారు గానీ.. అత్యంత ప్రధాన అంశాలేవీ ఇందులో లేవని ఆయన అన్నారు. ‘చరిత్రలో బహుశా ఇది అతి సుదీర్ఘమైన ప్రసంగం కావచ్ఛునని, అయితే ఇందులో శూన్యమే ఉందని వ్యాఖ్యానించారు. దేశం ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్య గురించిన ప్రస్తావనే ఇందులో లేదు.. మన యువత ఉద్యోగాలు పొందేందుకు […]

'అబ్బే ! ప్చ్ !' నిర్మలమ్మ బడ్జెట్ పై రాహుల్ పెదవి విరుపు !

ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు సమర్పించిన బడ్జెట్ పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పెదవి విరిచారు. ఈ ప్రసంగంలో (బడ్జెట్లో) పస ఏమీ లేదన్నారు. మరీ ఎక్కువగా.. ఆర్భాటంగా మాట్లాడారు గానీ.. అత్యంత ప్రధాన అంశాలేవీ ఇందులో లేవని ఆయన అన్నారు. ‘చరిత్రలో బహుశా ఇది అతి సుదీర్ఘమైన ప్రసంగం కావచ్ఛునని, అయితే ఇందులో శూన్యమే ఉందని వ్యాఖ్యానించారు. దేశం ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్య గురించిన ప్రస్తావనే ఇందులో లేదు.. మన యువత ఉద్యోగాలు పొందేందుకు అవసరమైన వ్యూహాత్మక ప్రతిపాదన ఏదీ లేదు.. ఇది కేవలం ప్రభుత్వ మైండ్ సెట్.. బ్రహ్మాండంగా ప్రసంగించినా ఈ దేశానికి ఒరిగేదేమీ లేదు’ అని రాహుల్ పేర్కొన్నారు. రాజ్యసభ ఎంపీ,, సీనియర్ కాంగ్రెస్ నేత.. ఆనంద్ శర్మ.. బడ్జెట్ గణాంకాలను సమర్పించడంలో నిర్మలా సీతారామన్ విఫలమయ్యారని విమర్శించారు. ఈ ప్రసంగం అద్భుతమైన ‘పూలవంటి పదాలతో కూడిన భాష’ లా ఉందని, ఆర్భాట ప్రకటనలు ఉన్నా.. ప్రతిపాదనలు అర్థ రహితంగా ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఇలాగే ఇతర కాంగ్రెస్ నేతలు కూడా నిర్మల బడ్జెట్ కేవలం ప్రసంగ పాఠంలా ఉందని అన్నారు.

Published On - 5:52 pm, Sat, 1 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu