Rahul Gandhi: మోదీ సర్కారుపై విరుచుకపడ్డ రాహుల్ గాంధీ.. మరో కీలక అంశాన్ని ప్రస్తావిస్తూ..

|

Apr 23, 2022 | 2:47 PM

Rahul Gandhi: ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. పెట్రో ధరలు పెంచుతూ , బ్యాంకుల ఎఫ్‌డీలపై వడ్డీలు తగ్గిస్తూ ప్రజలపై మోదీ మాస్టర్‌స్ట్రోక్‌ సంధిస్తున్నారని విమర్శించారు.

Rahul Gandhi: మోదీ సర్కారుపై విరుచుకపడ్డ రాహుల్ గాంధీ.. మరో కీలక అంశాన్ని ప్రస్తావిస్తూ..
Rahul Gandhi
Follow us on

Rahul Gandhi: ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. పెట్రో ధరలు పెంచుతూ , బ్యాంకుల ఎఫ్‌డీలపై వడ్డీలు తగ్గిస్తూ ప్రజలపై మోదీ మాస్టర్‌స్ట్రోక్‌ సంధిస్తున్నారని విమర్శించారు. పదేళ్లతో పోలిస్తే బ్యాంక్‌ వడ్డీలు గణనీయంగా తగ్గిపోవడంతో మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రాహుల్‌గాంధీ ట్వీట్‌ చేశారు. సామాన్యులు బ్యాంకుల్లో దాచుకున్న ఫిక్సిడ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 5 శాతానికి తగ్గగా.. ద్రవ్యోల్బణం 6.95 శాతానికి పెరిగిందంటూ మండిపడ్డారు. ఫిక్సిడ్ డిపాజిట్ వడ్డీ రేటు విషయంలో నేటి మోడీ సర్కారు, గతంలో యూపీఏ ప్రభుత్వ హయాం మధ్య తేడాను పోల్చారు. 2012లో రూ.2 లక్షల ఫిక్సిడ్ డిపాజిట్లపై రూ.19,152 వడ్డీ వచ్చేదని గుర్తుచేశారు. అయితే 2022లో రూ.2 లక్షల ఎఫ్‌డీలపై రూ.11,437 మాత్రమే వడ్డీ వస్తోందని విమర్శించారు. దీంతో మధ్య తరగతి ప్రజల పొదుపుకు మోదీ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని ఆరోపించారు.

ప్రతి ఒక్కరి బ్యాంక్‌ ఖాతాలో రూ.15 లక్షలు ఇస్తామన్న మోదీ వడ్డీ రేట్లను తగ్గించి మోసం చేశారంటూ ట్విట్టర్ వేదికగా రాహుల్ గాంధీ విమర్శనాస్త్రాలు సంధించారు.

Also Read..

Baby Food Diet: బేబీ ఫుడ్.. సెలబ్రిటీలు స్లిమ్‌గా ఉండటానికి కారణం ఇదేనట.. పూర్తి వివరాలివే..!

Hyderabad: అవయవదానం నిర్ణయం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తుంది.. మంత్రి హరీశ్ రావు వ్యాఖ్య