రక్షణ వ్యవహారాలపై గల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వాకౌట్ చేయలేదని, ఆయన ముందే అనుమతి తీసుకున్నారని ఈ పానెల్ చైర్మన్ జువల్ ఓరమ్ తెలిపారు. లడాఖ్ నియంత్రణ రేఖ వద్ద చైనా కారణంగా తలెత్తిన పరిస్థితిపైన, ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ల ఆక్రమణ అంశంపైన ఆయన గళమెత్తారని, అయితే చర్చల అనంతరం ఆయన అనుమతి తీసుకునే వెళ్లారని ఓరమ్ వివరించారు. బోర్డర్ లో పరిస్థితి గురించి ఆయన ప్రస్తావించారు. అయితే దీనికి సంబంధించి అజెండా ఏదీ ఖరారు కాలేదని ఆయనకు చెప్పాం అని ఓరమ్ పేర్కొన్నారు. కానీ రాహుల్ మాత్రం తమను మాట్లాడేందుకు చైర్మన్ అనుమతించలేదని మండిపడిన సంగతి తెలిసిందే.సరిహద్దు సమస్యపై చర్చ జరుగుతుండగా రాహుల్, ఇతర కాంగ్రెస్ సభ్యులు మధ్యలోనే వాకౌట్ చేశారని నిన్న వార్తలు వచ్చాయి. ఒక దశలో రాహుల్ కమిటీ చైర్మన్ తో వాగ్వివాదానికి దిగినట్టు కూడా ఈ వార్తలు పేర్కొన్నాయి.
చైనాతో గల సరిహద్దు సమస్యపై మోదీ ప్రభుత్వం నిజాలను దాస్తోందని, దేశ ప్రజలకు వాస్తవాలు తెలియకుండా మరుగు పరుస్తోందని రాహుల్ గాంధీ ఇటీవలి కాలంలో విమర్శిస్తున్నారు. పరిస్థితిని ఈ ప్రభుత్వం సరిగా హ్యాండిల్ చేయలేకపోతోందని కూడా ఆయన ఆరోపిస్తున్నారు. కీలకమైన డిఫెన్స్ పానెల్ సమావేశంలో ఈ అంశాలను లేవనెత్తబోగా ఎందుకు అనుమతించడం లేదని ఆయన ప్రశ్నిస్తున్నారు. లడాఖ్ లో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉందంటూ కొన్ని వార్తా పత్రికల్లో వచ్చిన వార్తను ఆయన తన ట్విటర్ కి జోడించారు కూడా.. అయితే ఇది నిరాధారమని సైనిక వర్గాలను పేర్కొంటూ మరికొన్ని వార్తలు వచ్చాయి.
మరిన్ని ఇక్కడ చూడండి : రామయ్య నువ్వు రావాలయ్యా..!క్లిష్ట పరిస్థితుల్లో రామయ్యె రామబాణం అంటూ ఫ్యాన్స్ స్వాగతం.:Jr.NTR ReEntry Politics Live Video.
భారీ వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం..! జలమయంగా మారిన మహానగరం..:Heavy Rains Live Video.