బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో తాను రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించారు. అయితే ఏ పార్టీలోనూ చేరడం లేదన్నారు. తానెప్పుడూ వన్ టైం ప్లేయర్ గానే ఉంటానని ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు. ఈ నెలారంభంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణ సందర్భంగా ఈయన రాజీనామా చేశారు. తన తాజా నిర్ణయాన్ని గురించి వివరిస్తూ.. సామాజిక సేవ చేయాలన్న తపనతో రాజకీయాల్లోకి వచ్చానని, అయితే పాలిటిక్స్ లో లేకుండా కూడా ఈ సేవ చేయవచ్చునని గుర్తించానని అన్నారు. ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయాల్లోనే ఉండాల్సిన అవసరం లేదని భావించానన్నారు. కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నారా అని ప్రశ్నించగా.. అది కూడా ఓ కారణమై ఉండవచ్చు అని సుప్రియో పేర్కొన్నారు. తన కుటుంబ సభ్హ్యులతోను, ఫ్రెండ్స్ తోను చర్చించానని ఈ నిర్ణయం తీసుకోవడానికి ఇదే తగిన సమయమని కూడా భావించానని ఆయన తెలిపారు. తన పొలిటికల్ కెరీర్ లో కొన్ని హామీలు నెరవేర్చానని, కొన్నింటిని నెరవేర్చలేకపోయానని అన్నారు.
అలాగే కొందరిని సంతోష పెట్టి ఉండవచ్చునని, మరికొందరిని బాధ పెట్టి ఉండవచ్చునని బాబుల్ సుప్రియో పేర్కొన్నారు. అయితే ఇదంతా డ్రామా అని తృణమూల్ కాంగ్రెస్ కొట్టి పారేసింది. తనను మంత్రి పదవి నుంచి తొలగించినందున బీజేపీ నేతల దృష్టిని ఆకర్షించేందుకు ఈ డ్రామా ఆడారని, నిజంగా రాజకీయాలను వీడాలనుకునేవారు ఎంపీ పదవిని కూడా వదులుకోవాలని తృణమూల్ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ అన్నారు. ఆయన ఇలా వ్యాఖ్యానించిన వెంటనే సుప్రియో తాను ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు.
మరిన్ని ఇక్కడ చూడండి : దొరుకుతవా దొర్కవా.. నేను దొర్కా పో..!చిరుతతో ‘కోతి’ కొమ్మచ్చి..వైరల్ వీడియో..:Cheetah vs Monkey Funny video.
ఆకాశమే విరిగిపడుతుందా రేంజ్ లో ఇసుక తుఫాన్..! అంతా సర్వనాశనం..:sandstorm in china Video.