మెడ చుట్టేసిన పైథాన్.. షాకింగ్ వీడియో..

|

Oct 17, 2019 | 12:57 PM

కేరళలో ఓ కొండచిలువ దాడి నుంచి ఓ వ్యక్తి కొన్ని సెకన్లలో బతికి బయటపడ్డాడు. ఇక దాని ఉడుంపట్టు నుంచి తప్పించుకోలేనని ప్రాణాల మీద ఆశలు వదులుకున్నాడు. అయితే స్థానికుల సాయంతో ప్రాణాన్ని రక్షించుకున్నాడు. తిరువనంతపురంలోని ఓ తోటలో పని చేస్తున్నాడు 62 ఏళ్ళ భువనచంద్రన్ నాయర్.. అతనితో బాటే మరికొంతమంది కూలీలు కూడా పొదలు శుభ్రం చేస్తుండగా.. సుమారు 10 అడుగుల పొడవున్న కొండచిలువ కనబడింది. దాన్ని చూసి వారు భయంతో పక్కకు తప్పుకోగా.. నాయర్ […]

మెడ చుట్టేసిన పైథాన్.. షాకింగ్ వీడియో..
Follow us on

కేరళలో ఓ కొండచిలువ దాడి నుంచి ఓ వ్యక్తి కొన్ని సెకన్లలో బతికి బయటపడ్డాడు. ఇక దాని ఉడుంపట్టు నుంచి తప్పించుకోలేనని ప్రాణాల మీద ఆశలు వదులుకున్నాడు. అయితే స్థానికుల సాయంతో ప్రాణాన్ని రక్షించుకున్నాడు. తిరువనంతపురంలోని ఓ తోటలో పని చేస్తున్నాడు 62 ఏళ్ళ భువనచంద్రన్ నాయర్.. అతనితో బాటే మరికొంతమంది కూలీలు కూడా పొదలు శుభ్రం చేస్తుండగా.. సుమారు 10 అడుగుల పొడవున్న కొండచిలువ కనబడింది. దాన్ని చూసి వారు భయంతో పక్కకు తప్పుకోగా.. నాయర్ ధైర్యంగా ఆ పైథాన్ ను ఒడిసి పట్టుకుని దూరంగా వదిలేయబోయాడు. అయితే అది అతని పట్టు నుంచి తప్పించుకుని.. అతని మెడ చుట్టూ పట్టు బిగించింది. ఆ పట్టు నుంచి విడిపించుకునేందుకు నాయర్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. క్రమంగా నాయర్ శరీరాన్ని కూడా చుట్టేందుకు యత్నించడంతో అతగాడు ఊపిరి తీసుకోలేక… శ్వాస ఆడక ఇబ్బంది పడ్డాడు. అది చూసి.. కూలీల్లో కొందరు ధైర్యంగా ముందుకు వచ్చి.. అతి కష్టం మీద నాయర్ మీది పైథాన్ పట్టు నుంచి అతడ్ని రక్షించారు.ఈ వీడియో వైరల్ అవుతోంది. కాగా- ఈ ఘటనలో నాయర్ కు స్వల్ప గాయాలయ్యాయి. చివరకు అటవీ శాఖ సిబ్బంది వఛ్చి కొండచిలువను పట్టుకుని దూరంగా అడవుల్లో వదిలిపెట్టారు.