AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విదేశీయులను తరిమి కొడతాం.. ఎన్.ఆర్.సీ.పై అమిత్ షా కీలక వ్యాఖ్య

దేశంలో ఎన్నో ఏళ్ళుగా అక్రమంగా నివసిస్తున్న లక్షలాది మంది విదేశీయులను దేశం నుంచి పంపేందుకు ఉద్దేశించిన నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్‌ను కచ్చితంగా అమలు చేసి తీరతామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కుండబద్దలు కొట్టారు. ఇందుకు డెడ్‌లైన్ కూడా నిర్దేశించుకున్నామని, 2024 కల్లా జాతీయ పౌరుల జాబితాను పూర్తి చేసిన తీరతామని ఆయన వెల్లడించారు. ఓ జాతీయ ఛానల్‌తో మాట్లాడిన అమిత్ షా.. ఎన్.ఆర్.సీ.పై కొనసాగుతున్న వివాదంపై విస్పష్టమైన వ్యాఖ్యలు చేశారు. మోదీ […]

విదేశీయులను తరిమి కొడతాం.. ఎన్.ఆర్.సీ.పై అమిత్ షా కీలక వ్యాఖ్య
Rajesh Sharma
|

Updated on: Oct 17, 2019 | 1:34 PM

Share

దేశంలో ఎన్నో ఏళ్ళుగా అక్రమంగా నివసిస్తున్న లక్షలాది మంది విదేశీయులను దేశం నుంచి పంపేందుకు ఉద్దేశించిన నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్‌ను కచ్చితంగా అమలు చేసి తీరతామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కుండబద్దలు కొట్టారు. ఇందుకు డెడ్‌లైన్ కూడా నిర్దేశించుకున్నామని, 2024 కల్లా జాతీయ పౌరుల జాబితాను పూర్తి చేసిన తీరతామని ఆయన వెల్లడించారు. ఓ జాతీయ ఛానల్‌తో మాట్లాడిన అమిత్ షా.. ఎన్.ఆర్.సీ.పై కొనసాగుతున్న వివాదంపై విస్పష్టమైన వ్యాఖ్యలు చేశారు. మోదీ ప్రభుత్వ ఉద్దేశాలను నిస్సంకోచంగా వివరించారు.

గత ఎన్నికల మేనిఫెస్టోలో తాము ఎన్.ఆర్.సీ. అమలుపై హామీ ఇచ్చామని, దానికి ప్రజలు తమకు అధికారాన్ని కట్టబెట్టి మద్దతు ఇచ్చారని వెల్లడించారు. వచ్చే పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో ఎన్‌ఆర్‌సీ అనేది కీలక అంశం అవుతుందని వ్యాఖ్యానించారు. ఇక.. ఎన్‌ఆర్‌సీలో భాగంగా, దేశవ్యాప్తంగా డిటెన్షన్ క్యాంపులను ఏర్పాటు చేస్తామని తెలిపారు. దేశంలో అక్రమంగా నివసిస్తున్న వారిని గుర్తించడానికి జాతీయ పౌరుల జాబితా కచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని షా అభిప్రాయపడ్డారు.

కాగా, ఎన్‌ఆర్‌సీ ప్రభావం దేశంలోని ముస్లింలపై ఎలాంటి పడబోదని, ఎలాంటి మత వివక్ష ఉండబోదని అమిత్ షా స్పష్టం చేశారు. ఆప్ఘనిస్తాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారిని శరణార్థులుగా పరిగణించబోమని, 2014 డిసెంబర్ 31కి ముందు ఆ దేశాల నుంచి వచ్చిన వారికి సీఏబీ కింద తొలుత పౌరసత్వం మంజురు చేస్తామని వివరించారు. ముస్లిమేతరులనే శరణార్థులుగా పరిగణిస్తామని తెలిపారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లో వాళ్లు వివక్షకు గురవుతున్నారని వెల్లడించారు. స్వాతంత్ర్య సమయంలో ఈ రెండు దేశాలు 30 శాతం హిందూ జనాభాను కలిగి ఉండేవని.. కానీ ప్రస్తుతం 6 శాతానికి పడిపోయిందని గుర్తు చేశారు. మరి ఆ జనాభా అంత ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు.

అందువల్లే జాతీయ పౌరుల జాబితాను అమలు చేయాలని నిర్ణయించుకున్నట్లు తేల్చిచెప్పారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్న హిందువులు, జైనులు, సిక్కులు, క్రిస్టియన్లు, బౌద్ధ మతస్థులు, పార్శీలు ఎలాంటి ఆందోళన పడాల్సిన పని లేదని ఆయన ఈ సందర్భంగా ఆయన భరోసా ఇచ్చారు.