Farmers Protest: పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ట్రాక్టర్ ర్యాలీలో అరెస్టయిన రైతులకు పరిహారం..

| Edited By: Anil kumar poka

Dec 23, 2021 | 6:48 PM

Charanjit Singh Channi: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాదిగా రైతు ఉద్యమం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరి 26న

Farmers Protest: పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ట్రాక్టర్ ర్యాలీలో అరెస్టయిన రైతులకు పరిహారం..
Farmers Protest
Follow us on

Charanjit Singh Channi: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాదిగా రైతు ఉద్యమం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. ఢిల్లీలో నిర్వహించిన ట్రాక్టర్ మార్చ్.. హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం ఢిల్లీ పోలీసులు పలువురు రైతులను అరెస్టు చేశారు. ఇంకా ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో పంజాబ్‌ ప్రభుత్వం రైతు ఉద్యమానికి మరోసారి సంఘీభావం తెలుపుతూ.. కీలక నిర్ణయం తీసుకుంది. ‘ట్రాక్టర్‌ ర్యాలీ’లో అరెస్టయిన రైతులకు రూ.2లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించారు. రైతు ఉద్యమంలో అరెస్టయిన 83 మంది రైతులకు రూ.2లక్షల చొప్పున పరిహారం అందించాలని నిర్ణయించామని సీఎం చన్నీ పేర్కొన్నారు. కాగా.. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంటున్నారు.

Also Read:

Hyderabad Police: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో చిక్కాడు.. పేరు తప్పు చెప్పి.. మళ్లీ అడ్డంగా బుక్కయ్యాడు..

Insurance Crime: రూ.23 కోట్ల బీమా డబ్బు కోసం రెండు కాళ్లు పోగొట్టుకున్నాడు.. చివరకు సీన్‌ రివర్స్‌..