ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రేపు పంజాబ్ లో నిర్వహించదలచిన ప్రెస్ మీట్ కి ఆ రాష్ట్ర ప్రభుత్వం నో చెప్పింది. దీన్ని నిర్వహించేందుకు అనుమతించబోమని పేర్కొంది. అయితే తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని ఆప్ నేతలు ప్రకటించారు. మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంటకు కేజ్రీవాల్ పంజాబ్ భవన్ లో జర్నలిస్టుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ రాష్ట్రంలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా పాగా వేసేందుకు కేజ్రీవాల్ ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలు పెట్టారు. ఈ స్టేట్ లో తాము అధికారంలోకి వచ్చిన పక్షంలో ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ నిస్తామని ఆయన హామీనిచ్చారు. ధరల పెరుగుదల కారణంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ ప్రభుత్వం పట్ల అసంతృప్తితో ఉన్నారని ఆయన అన్నారు. మా ఢిల్లీ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఉచితంగా 200 యూనిట్ల వరకు విద్యుత్ ఇస్తున్నామని, అలాగే ఇక్కడ కూడా ఇస్తామని ఆయన చెప్పారు.
వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో సీఎం అభ్యర్థి సిక్కుల నుంచే ఉంటారని అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఆ అభ్యర్థి ఎవరన్న ప్రశ్నకు ఆయన దీనిపై చర్చలు జరుగుతున్నాయని, త్వరలో మీకు తెలియజేస్తామని చెప్పారు. గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ లో 27 సీట్లను గెలుచుకోవడం ద్వారా ఆప్ ఇతర రాష్ట్రాల్లోనూ తమ సత్తా చూపడానికి తహతహలాడుతోంది. పంజాబ్ లోని ప్రస్తుత ప్రభుత్వంతో ప్రజలు విసుగెత్తి పోయారని, వారు మార్పును కోరుకుంటున్నారని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Sweden Prime Minister: స్వీడన్ పార్లమెంట్‌లో విశ్వాసం కోల్పోయిన ప్రధాని.. తన పదవికి రాజీనామా
Actress Kasturi: రజినీ కాంత్ అమెరికా టూర్ పై నటి కస్తూరి సంచలన కామెంట్స్.. క్లారిటీ కావాలంటూ..