కోవిద్ తో తలిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లలకు నెలకు రూ. 1500 సాయం, పంజాబ్ ప్రభుత్వ ప్రకటన, 21 ఏళ్ళ వరకు వెసులుబాటు

| Edited By: Anil kumar poka

May 20, 2021 | 9:41 PM

ఈ కోవిద్ పాండమిక్ సమయంలో తమ తలిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లలకు సోషల్ సెక్యూరిటీ పెన్షన్ గా నెలకు రూ... 1500 ఇవ్వాలని పంజాబ్ ప్రభుత్వం నిర్ణయించింది. గ్రాడ్యుయేషన్ వరకు ఉచితంగా విద్యను అందిస్తామని పేర్కొంది.

కోవిద్ తో తలిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లలకు  నెలకు రూ. 1500 సాయం, పంజాబ్ ప్రభుత్వ ప్రకటన, 21 ఏళ్ళ వరకు వెసులుబాటు
Follow us on

ఈ కోవిద్ పాండమిక్ సమయంలో తమ తలిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లలకు సోషల్ సెక్యూరిటీ పెన్షన్ గా నెలకు రూ… 1500 ఇవ్వాలని పంజాబ్ ప్రభుత్వం నిర్ణయించింది. గ్రాడ్యుయేషన్ వరకు ఉచితంగా విద్యను అందిస్తామని పేర్కొంది. ప్రభుత్వ స్కూళ్లలో వీరికి ఈ సౌకర్యం లభిస్తుందని, వీరికి 21 ఏళ్ళు వచ్చేవరకు ఈ వెసులుబాటు ఉంటుందని ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేందర్ సింగ్ తెలిపారు. ఇలాంటి బాలలకు ‘ఫోస్టర్ పేరెంట్స్’ గా ఉండాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదని ఆయన చెప్పారు. ఆశీర్వాద్ పథకం కింద కోవిడ్ రోగులకు జులై 1 నుంచి 51 వేల రూపాయల సాయం అందుతుందని ఆయన వెల్లడించారు. అలాగే వారికీ ఉచిత రేషన్ అందుతుందని చెప్పారు. ఇప్పటివరకు ఈ 51 వేల సహాయాన్ని పేద కుటుంబాల ఆడ పిల్లల పెళ్లిళ్లకు అందజేస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ సాయాన్ని ఇలా మళ్లించినట్టు ఆయన వివరించారు. ఇంకా ;ఘర్ ఘర్ రోజ్ గార్’ పథకం కింద కోవిద్ బాధితులకు తగిన ఉపాధి లేదా ఉద్యోగావకాశాన్ని కల్పించాలని ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో నిర్ణయించినట్టు అమరేందర్ సింగ్ తెలిపారు.
కోవిద్ రోగుల బంధువులఁతో తమ అధికారులు ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతుంటారని వారికీ ఏ సాయం అవసరమైనా అందజేసేందుకు తమ ప్రభుత్వం రెఢీగా ఉందని ఆయన వివరించారు.

దేశంలో కర్ణాటక, బెంగాల్ వంటి రాష్ట్రాల తరువాత పంజాబ్ లోనూ కోవిద్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. అయితే పరిస్థితిని తాము సమర్థంగా డీల్ చేయగలుగుతున్నామని అమరేందర్ సింగ్ చెప్పారు.

మరిన్ని చదవండి ఇక్కడ : Madhya Pradesh: కోవిడ్ సెంటర్‌లో టాయిలెట్ క్లీన్ చేసిన బీజేపీ ఎంపీ… ( వీడియో )

మధ్యదరా స‌ముద్రంలో ఘోరం….!! ప‌డ‌వ మునిగి 57 మంది మృతి… ( వీడియో )