సరిహద్దుల్లో పాక్ డ్రోన్ కలకలం.. అప్రమత్తమైన సైన్యం..!

పాకిస్థాన్.. తన వక్రబుద్ధిని మరోసారి ప్రదర్శిస్తోంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తరచూ పాక్ కవ్వింపు చర్యలకు పాల్పుడతూనే ఉంది. తాజాగా సోమవారం పంజాబ్ సరిహద్దుల్లో ఆ దేశానికి చెందిన డ్రోన్ ఒకటి సంచరించింది. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌ వద్ద ఉన్న హుస్సేనివాలా సరిహద్దు సమీపంలో ఈ డ్రోన్ కదలికలను బీఎస్ఎఫ్ గుర్తించింది. పాక్‌కు చెందిన డ్రోన్‌.. దాదాపు ఐదు సార్లు అక్కడే చక్కర్లు కొట్టి ఓసారి భారత సరిహద్దును కూడా దాటిందని గుర్తించారు. పాక్ సరిహద్దు వద్ద […]

  • Tv9 Telugu
  • Publish Date - 6:31 pm, Tue, 8 October 19
సరిహద్దుల్లో పాక్ డ్రోన్ కలకలం.. అప్రమత్తమైన సైన్యం..!

పాకిస్థాన్.. తన వక్రబుద్ధిని మరోసారి ప్రదర్శిస్తోంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తరచూ పాక్ కవ్వింపు చర్యలకు పాల్పుడతూనే ఉంది. తాజాగా సోమవారం పంజాబ్ సరిహద్దుల్లో ఆ దేశానికి చెందిన డ్రోన్ ఒకటి సంచరించింది. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌ వద్ద ఉన్న హుస్సేనివాలా సరిహద్దు సమీపంలో ఈ డ్రోన్ కదలికలను బీఎస్ఎఫ్ గుర్తించింది. పాక్‌కు చెందిన డ్రోన్‌.. దాదాపు ఐదు సార్లు అక్కడే చక్కర్లు కొట్టి ఓసారి భారత సరిహద్దును కూడా దాటిందని గుర్తించారు.

పాక్ సరిహద్దు వద్ద సోమవారం రాత్రి 10.00 గంటల నుంచి 10:40 వరకు చక్కర్లు కొట్టింది. తిరిగి అర్ధరాత్రి 12:25 గంటల సమయంలో భారత సరిహద్దుల్లోకి ప్రవేశించింది. డ్రోన్ కదలికలపై భారత జవాన్లు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో సరిహద్దు రక్షక దళాలైన బీఎస్ఎఫ్, పంజాబ్‌ పోలీసులు, ఇతర ఇంటెలిజెన్స్ వర్గాలు.. అక్కడ మంగళవారం ఉదయం నుంచి గాలింపు చర్యలు చేపట్టాయి. డ్రోన్స్ ద్వారా పాకిస్థానీ ఉగ్రమూకలు డ్రగ్స్‌, ఆయుధ సామాగ్రి సరఫరా చేస్తున్నారేమోనన్న సందేహంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా, గత కొద్ది రోజులుగా సరిహద్దుల్లో డ్రోన్ల సంచారంపై నిఘా వర్గాలు కూడా హెచ్చరించాయి. డ్రోన్ల ద్వారా దాడులు జరిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు కూడా ఇంటలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది. కాగా, రెండు వారాల క్రితం అనుమానాస్పదంగా తిరుగుతున్న రెండు డ్రోన్లను పంజాబ్‌ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.