
Lieutenant Governor Tamilisai: పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ రూటే సెపరేట్. ప్రజా సమస్యలను ప్రత్యక్ష్యంగా తెలుసుకోవడానికే ఆమె ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. పుదుచ్చేరిలో సామాన్య ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి తమిళపై బస్సులో ప్రయాణం చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది.
తవలకుప్పం జంక్షన్ దగ్గర లోని ఆంటోనియా చర్చి దగ్గర బస్సులో ఎక్కారు తమిళసై. రాజ్‌భవన్ నుంచి కారులో అక్కడి వరకు వచ్చారు. అభిషేకపక్కం బస్టాప్ వరకు ఆమె బస్సులో ప్రయాణం చేశారు. ఈ మార్గంలో చాలా ట్రాఫిక్ ఉందని , రెండు స్టాప్‌ల మధ్య ప్రయాణం గంటన్నర సేపు కావడంతో జనం చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు తమిళసై.
ఆస్పత్రులకు వెళ్తున్న పేషంట్స్ కూడా చాలా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తాను గుర్తించినట్టు చెప్పారు తమిళసై. ప్రజలు చాలా సమస్యలు తన దృష్టికి తీసుకొచ్చారని , పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల తరువాత ఆ సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు తమిళసై. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తునట్టు తెలిపారు.
తెలంగాణ గవర్నర్‌గా ఉన్న తమిళసైకి పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ అదనపు బాధ్యతలను అప్పగించారు . కిరణ్‌బేడీ స్థానంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమెను లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమించారు. ఏప్రిల్ 6వ తేదీన పుదుచ్చేరి అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. మే 2 వ తేదీన ఎన్నికల ఫలితాలు వస్తాయి. నారాయణస్వామి సర్కార్ అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోకపోవడంతో పుదుచ్చేరి అసెంబ్లీకి ఎన్నికలను నిర్వహిస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో తమిళసైకి పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవి అప్పగించడం సంచలనం రేపింది. అయితే ఎల్‌జీ పగ్గాలు చేపట్టగానే సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు తమిళసై. రాజ్‌భవన్‌లో చాలాకాలం నుంచి తిష్టవేసిన ఉద్యోగులను బదిలీ చేశారు. అంతేకాకుండా అధికార యంత్రాంగంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కాంగ్రెస్ నేతలు మాత్రం ఆమె పనితీరును విమర్శిస్తున్నారు. ఎన్నికల్లో లబ్ది కోసమే బీజేపీ తమ పార్టీ నేతను పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా చేసిందని విమర్శిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఈ ఇంటి ఖరీదు రూ. 6.5 కోట్లు … కానీ బాత్రూమ్‌కు డోర్ లేదు.. ప్రత్యేకత ఏంటో తెలుసా..
AP Municipal Elections 2021: ఏపీ మున్సిపోల్స్‌లో ఆఖరి ఘట్టం.. పోలింగ్‌కు సర్వం సిద్ధం..
1000 రూపాయలకు అల్లం, 30 రూపాయలకు గుడ్డు, పాకిస్తాన్ ‘వంటగది’లో ద్రవ్యోల్బణం సెగ…