
రైతు బిల్లులపై అప్పుడే దేశంలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీలో సోమవారం ఉదయం పంజాబ్ కాంగ్రెస్ కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో వఛ్చి ట్రాక్టర్ ను దహనం చేశారు. ఈ బిల్లులను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదించిన సంగతి విదితమే. అటు పంజాబ్, హర్యానా రాష్ట్రాల లోనూ అన్నదాతలు ఆందోళనలకు దిగారు. ఈ నిరసనలు ఇతర రాష్ట్రాలకు కూడా వ్యాపిస్తాయని రైతు సంఘాల నేతలు అంటున్నారు.
#WATCH: Punjab Youth Congress workers stage a protest against the farm laws near India Gate in Delhi. A tractor was also set ablaze. pic.twitter.com/iA5z6WLGXR
— ANI (@ANI) September 28, 2020