Prophet Remark Row: ఆ నగరాల్లో ఆత్మహుతి దాడులు చేస్తాం.. భారత్‌కు అల్‌ఖైదా బెదిరింపు..

|

Jun 08, 2022 | 8:15 AM

భారత్‌లోని ఢిల్లీ, ముంబయి, ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లలో ఆత్మాహుతి దాడులు చేస్తామంటూ ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా హెచ్చరించింది. మహ్మద్ ప్రవక్త గౌరవాన్ని కాపాడడం కోసం దాడులు చేస్తామంటూ పేర్కొంది.

Prophet Remark Row: ఆ నగరాల్లో ఆత్మహుతి దాడులు చేస్తాం.. భారత్‌కు అల్‌ఖైదా బెదిరింపు..
Al Qaeda
Follow us on

Prophet remark row: మహమ్మద్‌ ప్రవక్త (Muhammad) పై నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతోంది. చర్యలు తీసుకోవాలంటూ ఇప్పటికే పలు ముస్లిం దేశాలు భారత్‌ను కోరగా.. తాజాగా ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా (Al-Qaeda) కూడా దీనిపై స్పందించింది. మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలకు ప్రతీకారం తీర్చుకుంటామంటూ ప్రకటించింది. భారత్‌లోని ఢిల్లీ, ముంబయి, ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లలో ఆత్మాహుతి దాడులు చేస్తామంటూ ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా హెచ్చరించింది. మహ్మద్ ప్రవక్త గౌరవాన్ని కాపాడడం కోసం దాడులు చేస్తామంటూ పేర్కొంది. ఈ మేరకు అల్ ఖైదా సంస్థ ఓ లేఖను విడుదల చేసింది. ‘‘మహమ్మద్ ప్రవక్తను కించపరిచిన వారిని చంపేస్తాం. మా శరీరాలకు, మా పిల్లల శరీరాలకు పేలుడు పదార్థాలు అమర్చుకుని.. మహ్మద్ ప్రవక్త అంటే ఏమాత్రం గౌరవంలేని వారిని పేల్చేస్తాం. కాషాయ ఉగ్రవాదులు ఇక మృత్యువు కోసం ఎదురుచూడాలి.. ఢిల్లీ, ముంబై, యూపీ, గుజరాత్‌లలో పేలుళ్లు జరుపుతాం.. మహమ్మద్ ప్రవక్త కోసం ఇతరులు కూడా ఈ పోరాటంలో పాల్గొని ప్రాణాలు అర్పించాలి’’ అంటూ అల్ ఖైదా లేఖలో పేర్కొంది.

ఉత్తరప్రదేశ్‌లోని జ్ఞానవాపి మసీదు వివాదంపై ఇటీవల ఓ మీడియా ఛానెల్ నిర్వహించిన చర్చలో బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ మహమ్మద్ ప్రవక్తపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలు దేశాలు అభ్యంతరం వ్యక్తంచేయడంతోపాటు వివరణ ఇవ్వాలంటూ భారత రాయబార కార్యాలయాలకు నోటీసులు అందజేశాయి. ఈ క్రమంలో నూపుర్‌ శర్మ, నవీన్ జిందాల్ ను బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఇదిలాఉంటే.. నూపుర్‌ శర్మ చేసిన వ్యాఖ్యల కారణంగా దేశంలో పలుచోట్ల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నూపుర్‌శర్మ వ్యాఖ్యలను నిరసిస్తూ కాన్పూర్‌లో చేపట్టిన ఆందోళనల్లో భారీ హింస చెలరేగింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..