అస్సాంలోని తేయాకు తోటల్లో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ, కార్మికుల మధ్య తానూ’కార్మికురాలై ‘

అస్సాం పర్యటనలో ఉన్న కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ మంగళవారం బిశ్వనాథ్ జిల్లాలోని  తేయాకు (టీ) తోటలను సందర్శించారు. -అక్కడి కార్మికులతో కలిసి తానూ ఓ కార్మికురాలిగా మారి  టీ ఆకులను కోస్తూ కనిపించారు.

  • Updated On - 1:14 pm, Tue, 2 March 21 Edited By: Anil kumar poka
అస్సాంలోని  తేయాకు తోటల్లో  కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ, కార్మికుల మధ్య తానూ'కార్మికురాలై '

అస్సాం పర్యటనలో ఉన్న కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ మంగళవారం బిశ్వనాథ్ జిల్లాలోని  తేయాకు (టీ) తోటలను సందర్శించారు. -అక్కడి కార్మికులతో కలిసి తానూ ఓ కార్మికురాలిగా మారి  టీ ఆకులను కోస్తూ కనిపించారు. నుదుటికి బ్యాండ్ కట్టుకుని దానికి బ్యాలన్స్ చేస్తున్నట్టు తన వెనుక బుట్టను ఏర్పాటు చేసుకున్న ఆమె.. అందులో టీ ఆకులు వేస్తూ తోటి కార్మికులతో  ముచ్చటిస్తూ వాచ్చారు. అలాగే నడుముకు ఏప్రాన్ ను కూడా ప్రియాంక కట్టుకున్నారు. సాధురూ టీ గార్డెన్ అనే చోటికి ఈమె రాగానే.. ఆమెకు కార్మికులు ఘన స్వాగతం పలికారు.  ఇందుకు సంబంధించిన  ఫోటోలు, వీడియోలను కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. ఈ రాష్ట్రంలో నిన్న కూడా పర్యటించిన ప్రియాంక.. లఖింపూర్ లో గిరిజన యువతులతో కలిసి ఝముర్ డ్యాన్స్ చేసిన సంగతి తెలిసిందే.

అస్సాంలో మార్చి 27 నుంచి మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్ర పర్యటనలో ప్రియాంక గాంధీ,, స్థానిక కస్టమ్స్ లో చురుకుగా కనిపిస్తూ..ప్రజలను ఆకట్టుకోగలిగారు.  రాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో సీఎం సర్బానంద సోనోవాల్ ప్రభుత్వం తేయాకు కార్మికులకు రోజువారీ వేతనాన్ని 167 రూపాయల నుంచి 217 రూపాయలకు పెంచింది. అయితే తమకు 300కు పైగా రోజువారీ వేతనాన్ని పెంచాలని వేరు డిమాండ్ చేస్తున్నారు. 60 లక్షల జనాభా గల అస్సాంలో దాదాపు 10 లక్షల మంది తేయాకు కార్మికులు ఉన్నారు. సుమారు 35 సీట్లలో ఆయా పార్టీల అభ్యర్థుల భవితవ్యాన్ని వీరు నిర్దేశించగలుగుతారు. అందువల్లే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ స్థానాలపై దృష్టి పెట్టింది. కింది స్థాయి నుంచి ప్రజలను ఆకట్టుకోవడానికి ఈ పార్టీ అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. ఇక్కడ సోనోవాల్ పార్టీ, బీజేపీకి మిత్ర పక్షంగా ఉంది. అయితే అస్సాం పై పూర్తిగా పట్టు సాధించడానికి బీజేపీ శ్రమిస్తోంది. ప్రధాని మోదీ ఇటీవల ఈ రాష్ట్రంలో విస్తృత పర్యటనలు చేసి వివిధ ఇన్ ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్టులను ప్రారంభించారు. కొన్నింటిని జాతికి అంకితమిచ్చారు.

మరిన్ని చదవండి ఇక్కడ :

 

మూడవ అంతస్తు నుండి పిల్లల్ని కిటికీలోంచి ప‌డేసిన త‌ల్లి! Mother Throwing Children Out The Window Viral Video.

భారత విద్యుత్ కేంద్రాలపై చైనా సైబర్ దాడులు, నిప్పులు కక్కిన అమెరికా , చర్య తీసుకోవాలన్న ఎంపీ