CCTV in girl’s Washroom: బాలిక టాయిలెట్‌లో సీసీటీవీ కెమెరాలు.. పూణె పాఠశాలలో దారుణం.. ప్రిన్సిపాల్‌ను చితకబాదిన తల్లిదండ్రులు..
ఆ ప్రిన్సిపాల్‌పై కఠిన చర్యలు తీసుకోవలని ఆ స్కూల్‌లో చదవిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఏం చేశాడో తెలిస్తే మీరు కూడా అవును తీసుకోవల్సిందే అని అంటారు. వేసవి సెలవుల తర్వాత స్కూల్స్ తిరిగి తెరుచుకున్నాయి.

వీడు స్కూల్ ప్రిన్సిపాల్.. చేసే పనులు పాగల్ పనులు. వీడు అడ్డంగా దొరికితేకాని అసలు సంగతి బయట పడలేదు. ప్రతి రోజు నీట్‌గా రావడం.. విద్యార్థుల పట్ల తన పైశాచికత్వాన్ని ప్రదర్శించడం. వీడు రోజు చేసే పనులు. వీడు చేసే పాడు పనులను ఆ స్కూల్ తల్లిదండ్రులు ఎకరువు పెట్టారు. ఆ ప్రిన్సిపాల్‌పై కఠిన చర్యలు తీసుకోవలని ఆ స్కూల్‌లో చదవిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఏం చేశాడో తెలిస్తే మీరు కూడా అవును తీసుకోవల్సిందే అని అంటారు. వేసవి సెలవుల తర్వాత స్కూల్స్ తిరిగి తెరుచుకున్నాయి. స్కూల్ మొత్తం కెమెరాలు ఏర్పాటు చేశాడు. అయితే పనిలో పనిగా సీసీటీవీ కెమెరాలను బాలికల వాష్‌రూమ్‌లో ఏర్పాటు చేయించాడు.
బాలిక టాయిలెట్‌లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారనే ఆరోపణలపై ఆగ్రహించిన తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చారు. పాఠశాల ప్రిన్సిపాల్‌పై దాడి చేశారు. ఈ దారుణ ఘటన పూణేలోని అంబి ప్రాంతంలోని డివై పాటిల్ హైస్కూల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. స్కూల్ పిల్లలు తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడంతో వారు వచ్చిన పరిశీలించారు. వాష్‌రూమ్‌లో సీసీటీవీ కెమెరాలను గుర్తించిన తల్లిదండ్రులు షాక్ అయ్యారు. ఇదేంటని డివై పాటిల్ హైస్కూల్ ప్రిన్సిపాల్ అలెగ్జాండర్ కోట్స్‌ను ప్రశ్నిస్తే దురుసుగా ప్రవర్తించడని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
పూణెలోని ఒక పాఠశాలలో బాలికల వాష్‌రూమ్‌లలో సీసీ కెమెరాలు ఉన్నాయని విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడంతో ఆందోళన మొదలైంది. పూణేలోని తాలెగావ్‌లోని డివై పాటిల్ స్కూల్ ప్రిన్సిపాల్‌ను మితవాద సంస్థ సభ్యులు కొట్టారు. మంగళవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పాఠశాల విద్యార్థులను క్రైస్తవ ప్రార్థనలు చదవమని బలవంతం చేస్తుందని పిల్లల తల్లిదండ్రులు తాలెగావ్ ఎంఐడిసి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం. పిల్లలును క్రైస్తవ ప్రార్థనలు చేయమని బలవంతం చేస్తున్నారని తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం




