Diya Kumari: రాజకుటుంబం నుంచి ప్రజాస్వామ్యంలోకి.. రాజస్థాన్‌ రాజకీయాల్లో సరికొత్త పరిణామం..

|

Nov 18, 2023 | 2:05 PM

రాజకీయాల్లో ఒకప్పుడు రాజకీయ కుటుంబాల నుంచి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని వచ్చిన వారిని చూశాం. కానీ ఇప్పుడు రాజ కుటుంబం నుంచి ప్రాజాస్వామ్యంలోకి అడుగుపెట్టేందుకు సిద్దమయ్యారు. జైపూర్ రాజకుటుంబానికి చెందిన యువరాణి రాజస్థాన్ ఎన్నికల బరిలో దిగనున్నారు. ఈమె పేరు దియా కుమారి. జైపూర్‌లోని విద్యాధర్ నగర్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

Diya Kumari: రాజకుటుంబం నుంచి ప్రజాస్వామ్యంలోకి.. రాజస్థాన్‌ రాజకీయాల్లో సరికొత్త పరిణామం..
Princess Of Jaipur Royal Family And Vidhyadhar Nagar Candidate Diya Kumari Says Bjp Will Win In Rajasthan
Follow us on

రాజకీయాల్లో ఒకప్పుడు రాజకీయ కుటుంబాల నుంచి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని వచ్చిన వారిని చూశాం. కానీ ఇప్పుడు రాజ కుటుంబం నుంచి ప్రాజాస్వామ్యంలోకి అడుగుపెట్టేందుకు సిద్దమయ్యారు. జైపూర్ రాజకుటుంబానికి చెందిన యువరాణి రాజస్థాన్ ఎన్నికల బరిలో దిగనున్నారు. ఈమె పేరు దియా కుమారి. జైపూర్‌లోని విద్యాధర్ నగర్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. రాజస్థాన్‌లో చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంటానని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే రాజస్థాన్‌లో బీజేపీ అఖండ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రిని చేయాలనే ప్రశ్నకు దియా కుమారి సున్నితంగా తోసిపుచ్చారు. ఈ ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత మహిళా హక్కుల కోసం కృషి చేసేందుకు ప్రాధాన్యత ఇస్తానన్నారు. నేను జైపూర్ బిడ్డని నాకు రాజస్థాన్ కొత్తేమీ కాదు అన్నారు. తన విజయం కోసం కార్యకర్తలు కృషి చేస్తున్నారని, నవంబర్ 25వ తేదీ కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. నాకు పార్టీలో ఏ పదవి ఇచ్చినా స్వీకరించి ప్రజల కోసం పని చేస్తానన్నారు.

కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ ‘ప్రజలు గ్రాండ్ ఓల్డ్ పార్టీతో విసిగిపోయారని, రాష్ట్రంలో మహిళలపై నేరాలు పెరిగాయని, రాజస్థాన్ దేశానికి రేప్ క్యాపిటల్‌గా మారిందని.. ఈ విషయాన్ని స్వయంగా కాంగ్రెస్ మంత్రులే అంటున్నారు. అంటూ తీవ్రంగా విమర్షించారు. ఇండియా కూటమి పేరుతో సనాతన ధర్మాన్ని అవమాన పరిచారని విమర్శించారు. అశోక్ గెహ్లాట్ ఎన్నికల సమయంలో మాత్రమే రాముడిని స్మరించుకుంటారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ తన ఆరాధ్యదైవమని, తాను రాజకీయాల్లోకి రావడానికి ఎవరినీ సంప్రదించలేదన్నారు. ప్రధాని మోదీని కలిసినప్పుడల్లా ఏదో ఒక కొత్త అంశాన్ని నేర్చుకుంటానని తెలిపారు. ప్రజలతో ఎలా కనెక్ట్ అవ్వాలో ప్రధానమంత్రి మాకు చెబుతూనే ఉంటారు. ప్రజలతో మమేకమై ఉండేందుకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే గురించి మాట్లాడుతూ తనతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. నేను ఆమెను చాలా గౌరవిస్తానన్నారు.’

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..