PM Modi: దేశాభివృద్ధిలో కార్మిక శక్తిది కీలకపాత్ర.. తిరుపతిలో జరిగిన కార్మిక సదస్సులో వర్చువల్‌గా ప్రసంగించిన ప్రధాని మోదీ

|

Aug 25, 2022 | 10:01 PM

జాతీయ కార్మిక సదస్సులో వర్చువల్‌గా ప్రసంగించిన ప్రధాని మోదీ.. గత 8 ఏళ్లలో కార్మికుల సంక్షేమానికి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. రెండు రోజుల పాటు జరిగే..

PM Modi: దేశాభివృద్ధిలో కార్మిక శక్తిది కీలకపాత్ర.. తిరుపతిలో జరిగిన  కార్మిక సదస్సులో వర్చువల్‌గా ప్రసంగించిన ప్రధాని మోదీ
Pm Modi
Follow us on

మన కలలను సాకారం చేయడంలో కార్మిక శక్తి కీలక పాత్ర పోషిస్తోందన్నారు ప్రధాని మోదీ(PM Modi). తిరుపతిలో జరిగిన జాతీయ కార్మిక సదస్సులో వర్చువల్‌గా ప్రసంగించిన ప్రధాని మోదీ.. గత 8 ఏళ్లలో కార్మికుల సంక్షేమానికి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి ఎస్‌.హెచ్‌ భూపేంద్ర యాదవ్‌ అధ్యక్షత వహించారు. వివిధ రాష్ట్రాల కార్మిక మంత్రులు, కేంద్ర, రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన కార్మిక శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సదస్సులో తీసుకున్న నిర్ణయాలు దేశంలోని కార్మికులను శక్తివంతం చేస్తాయన్నారు. కార్మిక మంత్రిత్వ శాఖ 2047 సంవత్సరానికి తన విజన్‌ను సిద్ధం చేస్తోందని తెలిపారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కార్మిక మంత్రులు ఈ జాతీయ కార్మిక సదస్సులో పాల్గొన్నారు.

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్‌ధన్‌ యోజన, ప్రధాన మంత్రి జీవన్‌ జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన వంటి పథకాలు కోట్లాదిమంది కార్మికులకు ఎంతోకొంత రక్షణను, భద్రతను కల్పిస్తున్నాయన్నారు. దేశాభివృద్ధికి కార్మికులు చేస్తున్న కృషి, అందిస్తున్న తోడ్పాటుకు గుర్తింపు ఈ పథకాలని ప్రధాని మోదీ అభివర్ణించారు.

దేశం కార్మికులకు అవసరమైన సందర్భంలో మద్దతుగా నిలిచిందని, అదే సమయంలో కరోనా సంక్షోభం నుంచీ దేశాన్ని గట్టెక్కించేందకు కార్మికులు తమ పూర్తి శక్తియుక్తులను వెచ్చించారన్నారు. దాని ఫలితంగానే నేడు ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్‌ మరోసారి ఆవిర్భవించిందన్నారు.

ఇవి కూడా చదవండి

ఈ ఘనత అధికశాతం కార్మికులకే దక్కుతుందన్నారు. కార్మిక శక్తికి భద్రత కల్పించడంలో ఇ-శ్రమ్‌ పోర్టల్‌ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఏడాది కాలంలోనే దేశంలోని 400 ప్రాంతాలకు చెందిన 28 కోట్లమంది కార్మికులు పోర్టల్‌లో నమోదయ్యారన్నారు. ఇది ప్రత్యేకించి భవన నిర్మాణ కార్మికులు, వలస కూలీలు, గృహ పనివారికి బాగా మేలు చేసిందన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం