Narendra Modi Meeting: దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి శుక్రవారం ప్రధాన నరేంద్ర మోదీ మూడు కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. రేపు ఉదయం 9 గంటలకు కేంద్ర మంత్రులు, అధికారులతో భేటీ కానున్నారు. అలాగే ఉదయం 10 గంటలకు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఇక మధ్యాహ్నం 12.30 గంటలకు ఆక్సిజన్ తయారీదారులతో భేటీ కానున్నారు. అయితే ఒకే రోజు ప్రధాని మోదీ మూడు సమావేశాలు నిర్వహిస్తుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక దేశంలో కరోనా సెకండ్ వేవ్ దూసుకెళ్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్, కరోనా కఠినమైన ఆంక్షలు, నైట్ కర్ఫ్యూ విధిస్తున్నారు.
అయితే ఇప్పటికే ప్రధాన మోదీ కరోనా కట్టడిలో భాగంగా వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఒక వైపు కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతుంటే .. మరో వైపు కరోనా వ్యాప్తి వేగంగా పెరుగుతోంది. మరో వైపు దేశంలో లాక్‌డౌన్ విధించే అవకాశాలు ఉన్నాయని పుకార్లు వ్యాప్తించడంతో వలస కూలీలు సొంతళ్లకు పయనమవుతున్నారు. ఢిల్లీ, రాజస్థాన్, ముంబై తదితర ప్రాంతాల నుంచి వలస జీవులు ముల్లెమూట సర్దుకుని స్వస్థలాలకు బయలుదేరుతున్నారు. కూలీలతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు కిక్కిరిసిపోతున్నాయి.
కాగా, గత ఏడాది విజృంభించిన కరోనా వల్ల తీవ్ర నష్టం చవి చూడాల్సి వచ్చింది. రాబోయే కాలంలో కరోనా మరింత విజృంభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని గతంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), నిపుణులు హెచ్చరించారు. వారు హెచ్చరించినట్లే గతంలో కంటే ఇప్పుడు తీవ్రంగా వ్యాప్తిస్తోంది కరోనా.
ఇవీ కూడా చదవండి: PM Modi West Bengal Tour : రేపటి తన పశ్చిమ బెంగాల్ పర్యటనను రద్దు చేసుకున్న ప్రధాని మోదీ