టోక్యో ఒలింపిక్స్ విజేతలపై ప్రశంసలు కురిపించారు ప్రధాని మోడీ. 80వ మన్‌కీ బాత్‌లో ప్రసంగించిన పీఎం..టోక్యో వేదికగా పతకాలు గెలవడంతో యావత్ దేశం హర్షం వ్యక్తం చేసిందన్నారు. ఇవాళ జరిగిన పారా ఒలింపిక్స్‌లో భారత్‌కు సిల్వర్ మెడల్ రావడం ఆనందంగా ఉందని.. దేశంలోని యువతలో క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతోందన్నారు.
రేపు కృష్ణాష్టమి సందర్భంగా శ్రీ కృష్ణుని బోధలను గుర్తుచేశారు ప్రధాని. భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందుతున్నాయన్నారు. దేశంలో స్వచ్ఛ భారత్ ఊపందుకుందని..దీన్ని మరింత పెంచే దిశగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. క్లీన్ సిటీ పేరు సాధించిన ఇండోర్..ఇప్పుడు మొదటి వాటర్ ప్లస్ నగరంగా అవతరించిందన్నారు.
పోటీ తత్వంతోనే ప్రతి ఒక్కరు సమున్న విజయాలను అందుకోగలుగుతారని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. క్రీడలతో పాటు అంతరిక్ష పరిశోధనల్లో భారత్ అద్భుత ప్రగతిని సాధించిందని పేర్కొన్నారు. అరుదైన సెక్టార్లలో యువత వినూత్న రీతిలో విజయాలను అదుకోవడానికి తపన పడుతోందని, ఇది దేశ పురోగతికి, ఆత్మ నిర్భర్ భారత్‌కు నిదర్శనమని ప్రధాని నరేంద్ర మోడీ కితాబిచ్చారు. కృష్ణాష్ఠమి పర్వదినాన్ని పురస్కరించుకుని మోడీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గుజరాత్‌లోని సోమ్‌నాథ్ మందిరం అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని గుర్తు చేశారు.
ఇవి కూడా చదవండి: Uttarakhand landslide: ఉత్తరాఖండ్‌ను ముంచెత్తుతున్న వరదలు.. కొనసాగుతున్న ప్రకృతి బీభత్సం..రంగంలోకి NDRF బృందాలు..