Modi : గ్రామాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టి.. యువత, పిల్లల్లో వైరస్ సోకకుండా చర్యలు తీసుకోండి.. వైరస్ మ్యూటేషన్‌పై డైనమిక్‌గా ముందుకెళ్లండి : ప్రధాని

|

May 20, 2021 | 2:30 PM

Prime Minister Narendra Modi Interaction on Corona situation : దేశంలో ఎక్కువ కేసులు, మరణాలు సంభవిస్తోన్న 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జిల్లా అధికారులతో భారత ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు...

Modi : గ్రామాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టి.. యువత, పిల్లల్లో వైరస్ సోకకుండా చర్యలు తీసుకోండి..  వైరస్ మ్యూటేషన్‌పై  డైనమిక్‌గా ముందుకెళ్లండి : ప్రధాని
PM Modi
Follow us on

Prime Minister Narendra Modi Interaction on Corona situation : దేశంలో ఎక్కువ కేసులు, మరణాలు సంభవిస్తోన్న 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జిల్లా అధికారులతో భారత ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా రాష్ట్రాల్లో కేంద్ర సహకారం, వైద్య పరికరాల అవసరం, కరోనా కట్టడిలో జిల్లా అధికారులు చేపడుతోన్న చర్యలను అడిగి తెలుసుకొన్న ప్రధాని.. కరోనా వ్యాప్తి నివారణలో మరింత సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. వైరస్ మ్యూటేషన్‌పై మరింత డైనమిక్‌గా చర్యలు చేపట్టాలన్న ఆయన.. “వైరస్ మ్యుటేషన్‌పై సైంటిస్టులు సమర్థవంతంగా పరిశోధనలు చేస్తున్నారు. గ్రామాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టండి. దేశ యువత, పిల్లల్లో వైరస్ సోకకుండా చర్యలు తీసుకోండి. వైరస్ వ్యాప్తిని నిరోధించడంతో పాటు, పేద ప్రజల జీవన ప్రమాణాలపై దృష్టి పెట్టడమూ అవసరం” అని మోదీ స్పష్టం చేశారు. గత అనుభవాలు, సాధించిన విజయాలతో మరింత వ్యూహాత్మకంగా వైరస్‌ను అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్న ప్రధాని.. “భిన్న సంస్కృతులు, మతాలు దేశంలో ఉన్నాయి. పట్టణాలకంటే గ్రామాల్లో ప్రజలు మరింత ఐకమత్యంగా ఉంటారు. అక్కడ అధికారులు, గ్రామ పెద్దలతో కలిసి పని చేస్తే త్వరగా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చు. దేశంలో కొద్ది కాలంగా యాక్టివ్ కేసులు తగ్గుతూ వస్తున్నాయి. అయినా, మనం మరింత అప్రమత్తంగా ఉండాలి” అని మోదీ సూచించారు.

మీ అనుభవాలు, అభిప్రాయాల నుంచి కొత్త విధానాలు రూపొందాలి.. అని చెప్పిన మోదీ, మీరు చేసిన పని ఆచరణాత్మక సమర్థవంతమైన విధానాలను రూపొందించడంలో సహాయపడుతుందన్నారు. “అన్ని స్థాయిలలో రాష్ట్రాలు, వివిధ భాగస్వామ్య పక్షాల సలహాలతో టీకా వ్యూహాన్ని మరింత ముందుకు తీసుకువెళుతున్నారు.  అంటువ్యాధి (కరోనా) మనకు ఒక విషయం నేర్పింది. అంటువ్యాధులతో వ్యవహరించే మార్గాల్లో స్థిరమైన మార్పు, ఆవిష్కరణ చాలా ముఖ్యం. వైరస్ మ్యుటేషన్‌లో, ఫార్మాట్‌ను మార్చడంలో వేగంగా కదులుతోంది. కాబట్టి మన పద్ధతులు, వ్యూహాలు కూడా డైనమిక్‌గా ఉండాలి” అని ప్రధాని ఉద్భోధించారు. టీకా వృధానూ సాధ్యమైనంత తగ్గించాలని, ప్రాణాలను రక్షించడంతో పాటు, వారి జీవనాన్ని మెరుగుపర్చడం కూడా మన ప్రాధాన్యతే అని మోదీ చెప్పారు. పేదలకు ఉచిత రేషన్ కోసం ఏర్పాట్లు, బ్లాక్ మార్కెటింగ్‌ లేకుండా చర్యలపై దృష్టి పెట్టండని మోదీ ముఖ్యమంత్రులు, జిల్లా అధికార్లను కోరారు. కరోనాపై పోరాటంలో విజయం సాధించడానికి ఇవన్నీ అవసరం అని మోదీ నొక్కి వక్కాణించారు.

Read also : Covid ayurveda medicine : ‘ఆనందయ్య ఆయుర్వేద కరోనా మందుకు అడ్డం పడొద్దు..’ రాష్ట్ర ప్రభుత్వానికి మాజీ మంత్రి సోమిరెడ్డి వినతి