PM Modi: సినిమాలపై అనవసర కామెంట్స్ చేయడం మానుకోండి.. పార్టీ నేతలకు ప్రధాని మోదీ సూచన..

| Edited By: Ravi Kiran

Jan 20, 2023 | 8:36 AM

సినిమాలపై అనవసరమైన వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు అధికార వర్గాలు వెల్లడించాయి. జనవరి 16, 17 తేదీల్లో ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ...

PM Modi: సినిమాలపై అనవసర కామెంట్స్ చేయడం మానుకోండి.. పార్టీ నేతలకు ప్రధాని మోదీ సూచన..
Pm Modi
Follow us on

సినిమాలపై అనవసరమైన వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు అధికార వర్గాలు వెల్లడించాయి. జనవరి 16, 17 తేదీల్లో ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాని మోదీ ఈ ఆదేశాలను ఆమోదించినట్లు తెలుస్తోంది. ఏదో ఒక సినిమాపై చేస్తున్న కామెంట్లతో రోజంతా టీవీలో, మీడియాలో ప్లే అవుతోందని, అనవసర ప్రకటనలు చేయడం మానుకోవాలని పార్టీ కార్యకర్తలను ప్రధాని కోరారినట్లు తెలిపాయి. బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్, దీపికా పదుకొనే నటించిన పఠాన్ సినిమాను బహిష్కరించాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. పఠాన్ జనవరి 25, 2023న విడుదల కానుంది. రామ్ కదమ్, నరోత్తమ్ మిశ్రాతో సహా పలువురు బీజేపీ నాయకులు ఈ చిత్రంలో కాషాయ రంగు దుస్తులను ఉపయోగించడంపై విమర్శలు గుప్పించారు.

ఈ సినిమా చీప్ పబ్లిసిటీ కోసం పన్నిన ఎత్తుగడలా లేక వారి నిర్ణయం వెనుక కుట్ర దాగి ఉందా అని మహారాష్ట్ర బీజేపీ నేత రామ్ కదమ్ చిత్ర నిర్మాతలను ప్రశ్నించారు. మహారాష్ట్రలో హిందుత్వ ఆదర్శాలను అనుసరించే బీజేపీ ప్రభుత్వం ఉన్నందున, హిందుత్వ భావోద్వేగాలను అవమానించే ఏ సినిమా లేదా సీరియల్‌ని నడపడానికి ప్రభుత్వం అనుమతించదని బీజేపీ నాయకుడు తెలిపారు.

కాగా.. సినిమాలో కాషాయ రంగు దుస్తులు ధరించడంపై మధ్యప్రదేశ్ మంత్రి నరోత్తమ్ మిశ్రా మండిపడ్డారు. సినిమాలో కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని, ఆ షాట్‌లను మార్చకపోతే మధ్యప్రదేశ్‌లో పఠాన్‌ను నిషేధిస్తానని బెదిరించారు. చూడాలి మరి.. ఇన్ని విమర్శల మధ్య విడుదలకు రెడీ అవుతున్న పఠాన్.. ఏం చేస్తుందో..

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..