PM Modi: దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. మరో ఆరు నెలలు పూర్తి ఉచితం..

|

Mar 26, 2022 | 8:32 PM

దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉచిత రేషన్ పథకాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం..

PM Modi: దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. మరో ఆరు నెలలు పూర్తి ఉచితం..
Modi
Follow us on

Free Ration Supply: దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉచిత రేషన్ పథకాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. కరోనా సంక్షోభం కారణంగా ప్రజలెవరూ ఆకలితో ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతో ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన(పీఎంజీకేఏవై) పథకాన్ని ప్రవేశపెట్టింది. నిర్ణీత కాల వ్యవధితో ప్రవేశ పెట్టిన ఈ పథకం గడువు ఒకసారి ముగియగా.. పొడిగించింది. ఇప్పుడు మళ్లీ ఈ పథకాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం.

ఈ పథకం గడువును పొడిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ‘‘దేశంలోని ప్రజల శక్తిని మరింత బలోపేతం చేసేందుకు పీఎం గరీబ్‌ కల్యాణ్‌ అన్నయోజనను మరో ఆర్నెళ్ల పాటు అంటే సెప్టెంబర్‌ 2022 పొడిగించాలని కేంద్రం నిర్ణయించింది. ఇంతకుముందులాగే 80 కోట్ల మందికి పైగా ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోగలరు’’ అని ట్వీట్‌లో ఆయన పేర్కొన్నారు.

కాగా, ఈ పథకాన్ని కరోనా నేపథ్యంలో ఏప్రిల్ 2020 నుంచి ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. దీనికింద అర్హులైన ప్రజలకు ఉచిత రేషన్ పంపిణీ చేస్తోంది. అయితే, ఈ పథకాన్ని పలమార్లు గడువు పెంచుతూ వచ్చింది. తాజాగా మార్చి నెలాఖరుతో గడువు ముగియనుండటంతో.. కేంద్ర కేబినెట్‌ మీటింగ్‌లో దీనిపై చర్చించారు. ఈ పథకాన్ని మరోసారి పొడిగించాలని నిర్ణయించారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోదీ వెల్లడించారు.

Also read:

Andhra Pradesh: చేపల కోసం వల విసిరితే.. జాలర్లకు ఊహించని షాక్.. ఎదురుగా కళ్లు చెదిరే సీన్!

Sai Dharam Tej: యాక్సిడెంట్‌ తర్వాత సాయిధరమ్‌ తేజ్‌ మొదటి వీడియో.. ఆరోజు గుడ్‌న్యూస్‌ చెబుతానంటూ..

Viral Video: పాపం.. సింహాన్ని చెడుగుడు ఆడుకున్న జీబ్రా.. షాకింగ్ వీడియో వైరల్..