GST council Meeting : జీఎస్టీ మండలిలో కుదరని ఏకాభిప్రాయం.. పన్ను తగ్గింపు అంశంపై మంత్రి వర్గ ఉప సంఘం ఏర్పాటు

|

May 28, 2021 | 10:06 PM

కొవిడ్‌ ఔషధాలు, వ్యాక్సిన్లు, వైద్య పరిరకాలపై విధిస్తున్న పన్ను అంశంపై జీఎస్టీ మండలిలో ఏకాభిప్రాయం కుదరలేదు...

GST council Meeting : జీఎస్టీ మండలిలో కుదరని ఏకాభిప్రాయం.. పన్ను తగ్గింపు అంశంపై మంత్రి వర్గ ఉప సంఘం ఏర్పాటు
Nirmala Media Briefing
Follow us on

Finance Minister Nirmala Sitharaman Press briefing : కొవిడ్ వ్యాక్సిన్లపై పన్ను రేట్లు యథాతథంగానే కొనసాగనున్నాయి. కొవిడ్‌ ఔషధాలు, వ్యాక్సిన్లు, వైద్య పరిరకాలపై విధిస్తున్న పన్ను అంశంపై జీఎస్టీ మండలిలో ఏకాభిప్రాయం కుదరలేదు. పన్ను తగ్గింపు అంశంపై మంత్రి వర్గ ఉప సంఘం ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి చెప్పారు.  ఈ ఉపసంఘం 10 రోజుల్లో నివేదిక ఇస్తుందని తెలిపారు. అయితే, విరాళంగా వచ్చిన వైద్య పరిరకాలకు సంబంధించి జీఎస్టీ మినహాయింపు కొనసాగించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రభుత్వం లేదా ఏజెన్సీలకు వచ్చే వైద్య పరిరకాలపై మినహాయింపు ఈ ఏడాది ఆగస్టు 31 వరకు కొనసాగుతుందని తెలిపారు. అలాగే, మినహాయింపు జాబితాలో బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సకు ఉపయోగించే ఆంఫోటెరిసిస్‌-బి ఔషధాన్ని చేర్చినట్లు వివరించారు. 1.58 లక్షల కోట్ల రూపాయలు సేకరించి జీఎస్​టీ లోటు కింద రాష్ట్రాలకు అందించేందుకు ప్యానల్​ నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అలాగే.. ప్రత్యేక భేటీ నిర్వహించి జీఎస్​టీ లోటు పరిహారం వ్యవధిని 2022 ఆపైన పెంచేందుకు నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు.

Read also :  GST Council Meeting : 43వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ప్రారంభం.. సమావేశంలో పాల్గొన్న అన్నిరాష్ట్రాల ఆర్థిక మంత్రులు

KTR : వేములవాడలో 22 కోట్లతో అత్యాధునికంగా నిర్మించిన 100 పడకల ఏరియా హాస్పిటల్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్