AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

President South Sojourn: రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌ శీతాకాల విడిది రద్దు.. వాయిదాకి కారణం అదేనా!

President Ram Nath Kovind: రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌ శీతాకాల విడిది రద్దు అయ్యింది. ఈ మేరకు ఢిల్లీ రాష్ట్రపతి భవన్ వర్గాలు వెల్లడించాయి.

President South Sojourn: రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌ శీతాకాల విడిది రద్దు.. వాయిదాకి కారణం అదేనా!
President Ram Nath Kovind
Balaraju Goud
|

Updated on: Dec 27, 2021 | 7:35 AM

Share

President Ram Nath Kovind Hyderabad tour: రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌ శీతాకాల విడిది రద్దు అయ్యింది. ఈ మేరకు ఢిల్లీ రాష్ట్రపతి భవన్ వర్గాలు వెల్లడించాయి. ప్రతి ఏడాది సంప్రదాయం ప్రకారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు వస్తుంటారు. ఈ క్రమంలో బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేసేందుకు ఆయన డిసెంబర్ చివరి వారంలో రానున్నారని రాష్ట్రపతి భవన్ ఇటీవల తెలిపింది. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడంతో తెలంగాణ అధికారులు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించారు. ఏర్పాట్లపై కంటోన్మెంట్‌, జీహెచ్‌ఎంసీ అధికారులతో మేడ్చల్‌ కలెక్టర్‌ హరీష్‌ సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు.

అయితే, రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌ శీతాకాల విడిది రద్దు అయ్యినట్లు తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్రపతి భవన్‌ సమాచారం అందించింది. షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 29 నుంచి జనవరి 3వరకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ హైదరాబాద్ రావల్సి ఉంది. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కేసు పెరుగుతుండటం, కొత్తగా ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో వాయిదా పడ్డట్టు సమాచారం. మరోవైవైపు రాష్ట్రపతి రాక సందర్భంగా బొల్లారంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ప్రోటోకాల్ విభాగం చేపట్టింది. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఆక్టోపస్ పోలీసులు రాష్ట్రపతి నిలయంలో మాక్‌ డ్రిల్ చేపట్టారు.

Read Also…  West Bengal: బెంగాల్‌లో బీజేపీకి షాక్.. పార్టీ వీడనున్న ఐదుగురు ఎమ్మెల్యేలు.. సుప్రియో ట్వీట్‌తో కలకలం!

Follow Us
కుర్రకారును ఆకట్టుకుంటున్న ట్రెండింగ్ హీరోయిన్స్
కుర్రకారును ఆకట్టుకుంటున్న ట్రెండింగ్ హీరోయిన్స్
రాబోయే భారీ చిత్రాలకు తప్పని గ్రాఫిక్స్ కష్టాలు
రాబోయే భారీ చిత్రాలకు తప్పని గ్రాఫిక్స్ కష్టాలు
వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. త్వరలో పెట్రోల్‌ బైక్స్‌ బ్యాన్..!
వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. త్వరలో పెట్రోల్‌ బైక్స్‌ బ్యాన్..!
వందల కోట్లు బూడిదలో పోసిన పన్నీరేనా ?? కారణాలివే
వందల కోట్లు బూడిదలో పోసిన పన్నీరేనా ?? కారణాలివే
స్పిరిట్ పై విమర్శలు.. ఐ డోంట్ కేర్ అంటున్న సందీప్ వంగా
స్పిరిట్ పై విమర్శలు.. ఐ డోంట్ కేర్ అంటున్న సందీప్ వంగా
కలిసి 20 సినిమాలు.. అయినా ఆమెతో 30ఏళ్లు మాట్లాడని హీరో కృష్ణ
కలిసి 20 సినిమాలు.. అయినా ఆమెతో 30ఏళ్లు మాట్లాడని హీరో కృష్ణ
జన నాయగన్‌ను వాళ్లే లీక్ చేశారా ?? పైరసీ వెనుక రాజకీయ కుట్ర
జన నాయగన్‌ను వాళ్లే లీక్ చేశారా ?? పైరసీ వెనుక రాజకీయ కుట్ర
చికెన్‌లోని ఈ పార్ట్స్‌తో జాగ్రత్త.. మర్చిపోయి కూడా తినొద్దు..
చికెన్‌లోని ఈ పార్ట్స్‌తో జాగ్రత్త.. మర్చిపోయి కూడా తినొద్దు..
వంటగది టైల్స్‌పై జిడ్డు మరకలా? ఆ సమస్యకు చెక్ పెట్టండిలా!
వంటగది టైల్స్‌పై జిడ్డు మరకలా? ఆ సమస్యకు చెక్ పెట్టండిలా!
బంగారమే కాదు, అక్షయతృతీయ రోజు ఇవి కొన్నా అదృష్టం కలిసొస్తది!
బంగారమే కాదు, అక్షయతృతీయ రోజు ఇవి కొన్నా అదృష్టం కలిసొస్తది!