President Droupadi Murmu: సబ్‌మెరైన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సాహస ప్రయాణం.. ఫొటోలు చూశారా..

దేశ ప్రథమ పౌరురాలు, త్రివిధ దళాల సుప్రీం కమాండర్‌, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. సబ్‌మెరైన్‌లో సాహస ప్రయాణం చేశారు. గతంలో రఫేల్‌ యుద్ధ విమానంలో గగనవిహారం చేసిన ఆమె, ఈసారి సముద్రపు లోతులను చూశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, జలాంతర్గామిలో ప్రయాణించారు. కర్నాటకలోని కార్వార్ నేవీ బేస్‌కి వెళ్లి అక్కడి నుంచి INS వాఘ్‌షీర్‌లో ప్రయాణించారు.

President Droupadi Murmu: సబ్‌మెరైన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సాహస ప్రయాణం.. ఫొటోలు చూశారా..
President Droupadi Murmu

Updated on: Dec 28, 2025 | 5:48 PM

దేశ ప్రథమ పౌరురాలు, త్రివిధ దళాల సుప్రీం కమాండర్‌, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. సబ్‌మెరైన్‌లో సాహస ప్రయాణం చేశారు. గతంలో రఫేల్‌ యుద్ధ విమానంలో గగనవిహారం చేసిన ఆమె, ఈసారి సముద్రపు లోతులను చూశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, జలాంతర్గామిలో ప్రయాణించారు. కర్నాటకలోని కార్వార్ నేవీ బేస్‌కి వెళ్లి అక్కడి నుంచి INS వాఘ్‌షీర్‌లో ప్రయాణించారు. రాష్ట్రపతి వెంట చీఫ్‌ ఆఫ్‌ నేవీ స్టాఫ్‌ అడ్మిరల్‌ దినేష్‌ కె. త్రిపాఠి కూడా ఉన్నారు. ఈ కల్వరి క్లాస్ సబ్‌మెరైన్‌ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైంది. జలాంతర్గామిలో ప్రయాణించిన రెండో రాష్ట్రపతిగా ముర్ము నిలిచారు. గతంలో అబ్దుల్‌ కలాం సబ్‌మెరైన్‌లో ప్రయాణిస్తే.. ఇప్పుడు ముర్ము INS వాఘ్‌షీర్‌లో పయనించారు.

రెండు నెలల క్రితం కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇలాంటి సాహసమే చేశారు. రఫేల్‌ యుద్ధ విమానంలో ఆమె గగన విహారం చేశారు. హర్యానాలోని అంబాలా వైమానిక స్థావరం నుంచి రఫేల్‌ ఫైటర్‌ జెట్‌లో రాష్ట్రపతి ప్రయాణించారు. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక, 2023 మే 8న ద్రౌపదీ ముర్ము అసోంలోని తేజ్‌పూర్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ నుంచి సుఖోయ్‌-30 MKI యుద్ధ విమానంలో విహరించారు.

ఈ ప్రయాణం చేసిన రెండో మహిళా రాష్ట్రపతిగా ఆమె గుర్తింపు సాధించారు. అంతకుముందు 2009లో అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ ఇదే ఫైటర్‌జెట్‌లో గగనయానం చేశారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం కూడా 2006లో పుణె వాయుసేన స్థావరం నుంచి సుఖోయ్‌-30 యుద్ధ విమానంలో విహరించారు. అటు ఫైటర్‌ జెట్‌లో గగనతలంలో సాహస ప్రయాణం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఈసారి సబ్‌మెరైన్‌లో సాహసయాత్ర చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..