Draupadi Murmu: ఈ అవకాశం వస్తుందని అస్సలు ఊహించలేదు.. ఏన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము

|

Jun 22, 2022 | 6:15 AM

రాయ్‌రంగ్‌పూర్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ద్రౌపది ముర్ము.. మయూర్‌భంజ్ జిల్లాకు చెందిన గిరిజన మహిళనైన తనను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తారని ఎప్పుడూ అనుకోలేదన్నారు.

Draupadi Murmu: ఈ అవకాశం వస్తుందని అస్సలు ఊహించలేదు.. ఏన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము
Draupadi Murmu
Follow us on

President Election 2022: ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ఒడిశాకు చెందిన ఆదివాసీ నాయకురాలు ద్రౌపది ముర్ము పేరును బీజేపీ ప్రకటించింది. దీంతో ఒడిశాలోని రాయ్‌రంగ్‌పూర్‌లో సందడి వాతావరణం నెలకొంది. ద్రౌపది ముర్ము (Draupadi Murmu) పేరును ప్రకటించిన అనంతరం మంగళవారం రాత్రి ఆమెకు శుభాకాంక్షలు తెలిపేందుకు జనం పెద్ద ఎత్తున ఆమె ఇంటికి తరలివచ్చారు. కాగా.. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికవడం పట్ల ద్రౌపది ముర్ము స్పందించారు. ఈ విషయం తెలియగానే ఆశ్చర్యంతో పాటు ఆనందం కలిగిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మీ అందరి నుంచి నాకు ఈ వార్త అందింది.. అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. నేను దీనిపై ఏమీ వ్యాఖ్యానించదలచుకోలేదు’’ అంటూ ముర్ము పేర్కొన్నారు.

రాయ్‌రంగ్‌పూర్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ద్రౌపది ముర్ము.. మయూర్‌భంజ్ జిల్లాకు చెందిన గిరిజన మహిళనైన తనను రాష్ట్రపతి అభ్యర్థిగా చేస్తారని ఎప్పుడూ అనుకోలేదన్నారు. ఆదివాసీ మహిళను ఎంపిక చేయడం ద్వారా ఎన్డీయే ప్రభుత్వం.. ‘సబ్ కా సాథ్ సబ్ కా విశ్వాస్’ అనే బీజేపీ నినాదాన్ని రుజువు చేసిందన్నారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన కూతురును కావున ఆ రాష్ట్రంలోని అన్ని పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేల మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. గిరిజన నేత నుంచి గవర్నర్ వరకు సేవలందిచిన ముర్ము.. తనను ఎన్డీఏ దేశ అత్యున్నత అభ్యర్థిగా ప్రకటించినట్లు టీవీ ద్వారా తెలిసిందని చెప్పారు.

ఇవి కూడా చదవండి

ఒడిశా ఎమ్మెల్యేలు, ఎంపీలందరి మద్దతు లభిస్తుంది..

బిజూ జనతాదళ్ (బిజెడి) మద్దతు లభిస్తుందా అని మీడియా ప్రశ్నించగా.. ‘‘ఒడిశా ఎమ్మెల్యేలు, ఎంపీలందరి మద్దతు నాకు లభిస్తుందని ఆశిస్తున్నాను’’ అని ముర్ము అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల కోసం ఎలక్టోరల్ కాలేజీలో BJDకి 2.8 శాతం కంటే ఎక్కువ ఓట్లు ఉన్నాయి. ‘‘నేను ఈ రాష్ట్రానికి చెందిన కూతురిని. నన్ను ఆదరించాలని ప్రతి ఒక్కరినీ అభ్యర్థించే హక్కు తనకు ఉందన్నారు. ముర్ము 1997లో రాయ్‌రంగ్‌పూర్ నగర్ పంచాయతీ కౌన్సెలర్ గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, 2000లో BJD-BJP సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా చేశారు. 2015లో జార్ఖండ్‌కు మొదటి మహిళా గవర్నర్‌గా నియమకమై సేవలందించారు.

ఈ అవకాశం వస్తుందని ఊహించలేదు – ముర్ము

ముర్ము మాట్లాడుతూ.. ఈ అవకాశం ఊహించలేదని తెలిపారు. తాను జార్ఖండ్‌కు గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆరేళ్లకు పైగా రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని పేర్కొన్నారు.. అందరూ తనను ఆదరిస్తారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. ద్రౌపది అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన తర్వాత ఆమె స్వస్థలమైన మయూర్‌భంజ్ జిల్లాలో సందడి వాతావరణం నెలకొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..