ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. పంజాబ్ సీఎం కెప్టెన్ అమరేందర్ సింగ్ కి ప్రిన్సిపల్ అడ్వైజర్ గా ఉన్న ఈయన ప్రజా జీవనంలో క్రియాశీలక పాత్ర నుంచి తాత్కాలికంగా వైదొలగాలని నిర్ణయించుకున్నారు. నా తదుపరి చర్యపై నేనింకా నిర్ణయం తీసుకోవలసి ఉందని.. ప్రజా జీవనంలో యాక్టివ్ రోల్ నుంచి తాత్కాలికంగా బ్రేక్ తీసుకోదలచానని ఆయన పంజాబ్ ముఖ్యమంత్రికి రాసిన లేఖలో తెలిపారు. ఈ కారణంగా మీ ముఖ్య సలహాదారుగా బాధ్యతలు నిర్వర్తించలేనని,, వీటి నుంచి నన్ను రిలీవ్ చేయాలని ఆయన కోరారు. 2022 లో జరిగే రాష్ట్ర ఎన్నికల కన్నా ఆయన 2024 లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలపైనే మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్న తరుణంలో పీకే తీసుకున్న నిర్ణయం ఈ రాష్ట్ర సీఎం అమరేందర్ సింగ్ కి తీవ్ర అసంతృప్తిని కలిగించింది.. మొత్తం దేశమంతా 2024 ఎన్నికల వైపు చూస్తున్నప్పుడు కేవలం ఒక రాష్ట్ర ఎలెక్షన్స్ పై ఫోకస్ పెట్టడంలో ఔచిత్యం లేదని పీకే సన్నిహిత వర్గాలు భావిస్తున్నాయి. ఆ ఎన్నికల ముందే సమైక్యంగా ఉండి ఫ్రంట్ ను ఏర్పాటు చేయాలని విపక్షాలన్నీ భావిస్తున్న వేళ సహజంగానే ప్రశాంత్ కిషోర్ దీనికే ప్రాధాన్యం ఇస్తున్నట్టు కనిపిస్తోంది. పైగా గత నెలలో ఆయన ఢిల్లీలో గాంధీ కుటుంబంతో చాలాసార్లు సమావేశమై చర్చలు జరిపారు.
ఇటీవల ఢిల్లీ వచ్చిన బెంగాల్ సీఎం..తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ ప్రశాంత్ కిషోర్ తో భేటీ అయ్యారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ ఘన విజయానికి కారకుడైన పీకేపై అన్ని ప్రతిపక్షాలూ ఆశలు పెట్టుకున్నాయి.
మరిన్ని ఇక్కడ చూడండి : తండ్రికి తగ్గ తనయుడిగా..కర్రసాము వీరుడిగా..పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్…:Akira Nandan Martial Arts video.