Prashant Kishor: రాహుల్‌ గాంధీ, ప్రియాంకతో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ.. కీలక మంతనాలు

Prashant Kishor meets Rahul Gandhi: దేశంలో రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పుంజుకునే దిశగా అడుగులేస్తోంది. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు

Prashant Kishor: రాహుల్‌ గాంధీ, ప్రియాంకతో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ.. కీలక మంతనాలు
Prashant Kishor And Rahul Gandhi

Updated on: Jul 13, 2021 | 5:41 PM

Prashant Kishor meets Rahul Gandhi: దేశంలో రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పుంజుకునే దిశగా అడుగులేస్తోంది. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని.. మంగళవారం రాజకీయ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కలిశారు. ఢిల్లీలోని రాహుల్ గాంధీ నివాసానికి.. ప్రశాంత్ కిషోర్ స్వయంగా వెళ్లి కలుసుకోవడంతో కొంత ప్రాధాన్యం సంతరించుకుంది. వచ్చే ఏడాది జరగబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ నేతలతో పీకే చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే.. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు.

కొద్ది రోజులుగా అధికార బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అతిపెద్ద రాజకీయ ఫ్రంట్ ఏర్పాటు కోసం పలు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోనే ఫ్రంట్ ఏర్పాటు కావాలని.. కాంగ్రెస్ లేకుండా బీజేపీకి ప్రత్యామ్నాయ ఫ్రంట్ ఏర్పాటు చేయడం సాధ్యం కాదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ సహా మరికొంత మంది నేతలు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే పీకే శరద్ పవార్‌తో రెండు సార్లు సమావేశమయ్యారు.

బీజేపీని ఎదుర్కొనేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే రాహుల్‌ను పీకే కలిసినట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం రాహుల్ గాంధీని ప్రశాంత్ కిషోర్ ప్రశంసించడం, భవిష్యత్ నేత రాహులేనంటూ ఆయన చేసిన ప్రసంగాలు చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పీకే రాహుల్, ప్రియాంకను కలవడం ఉత్కంఠ రేపుతోంది.

పీకే కొంత కాలంగా బీజేపీయేతర పక్షాలకు ఎన్నికల వ్యూహకర్తగా పని చేస్తూ వస్తున్నారు. అయితే.. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం తాను ఇప్పుడు చేస్తున్న పనిని వదిలేస్తానని పీకే ప్రకటించినప్పటికీ ఎన్డీఏకు వ్యతిరేక కూటమి కోసం పనిచేస్తుండటం ప్రధాన్యత సంతరించుకుంది. దీంతోపాటు వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్, గుజరాత్, పంజాబ్, ఉత్తరాఖండ్ లల్లో ఎన్నికలు సైతం జరగనున్నాయి.

Also Read:

Rainy Season Safe Driving Tips: వాన‌కాలం ప్ర‌యాణాల్లో ప్ర‌మాదాలు పొంచి ఉంటాయి.. ఈ జాగ్ర‌త్తలు తీసుకుంటున్నారా..?

Loosing Teeth: దంతాలు రాలిపోతే.. మీ జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతుంది..తాజా పరిశోధనల్లో వెల్లడి