PMSYM Scheme:కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఎన్నో ఉపగయోగకరమైన పథకాలను అందిస్తుంది. వీటిల్లో ఒకటి ప్రధాన్ మంత్రి శ్రమ యోగి మాన్ ధన్ యోజన ఒకటి. ఈ పథకంద్వారా సామాన్యులకు, మధ్యతరగతి వారి భవిష్యత్ కు భరోసా లభిస్తుంది. ముఖ్యంగా ఒక వయసు వచ్చిన తర్వాత ఆర్ధిక ఇబ్బందులు పడకూడదు అనుకునే వారికి ఈ పథకం అత్యంత ఉపగయోగం. ఈ పథకంలో చేరిన వారు ప్రతి నెలా డబ్బులను పొందవచ్చు.
ఈ స్కీమ్ లో చేరడానికి ఆటో డ్రైవర్లు, కార్మికులు, కిరాణా షాపు వారు, హ్యాండర్లు ఇలా అసంఘటిత రంగానికి చెందిన వారు ఎవరైనా అర్హులే.. అయితే ఈ పథకంలో చేరడానికి కనీసం 18 ఏళ్ళు వయసు ఉండాలి. ఇక 40 సంవత్సరాలు మించకూడదు.
శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన పథకంలో చేరిన వారికి 60 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి నెలా డబ్బులు వస్తాయి. నెలకు రూ.3 వేలు పొందొచ్చు. దీని కోసం స్కీమ్‌లో చేరే వారు నెలకు రూ.55 నుంచి రూ.200 కట్టాలి. మీ వయసు ప్రాతిపదికన మీకు వచ్చే పెన్షన్ డబ్బులు మారుతూ ఉంటాయి. మీరు దగ్గరిలోని సీఎస్‌సీ సెంటర్‌కు వెళ్లి శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన పథకంలో చేరొచ్చు.
దీని కోసం ఆధార్ కార్డు, జన్ ధన్ అకౌంట్ ఉంటే సరిపోతుంది. అలాగే పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా కావాలి. నామినీ సదుపాయం ఉంటుంది. మీరు స్కీమ్‌లో చేరిన తర్వాత మీకు శ్రమ్ యోగి కార్డు ఇస్తారు.
Also Read: ఈరోజు ఏ రాశి వారు వాహన ప్రయాణంలో , పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలంటే..!