AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఎండలకు పిట్టల్లా రాలిపోతున్న జనాలు.. మృతదేహాలతో కిక్కిరిసిపోతున్న మార్చురీలు!

నిన్నమొన్నటి వరకు వాన జల్లులు ఆడపాదడపా కురిసినా మళ్లీ భానుడు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాడు. దీంతో దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలకు తట్టుకోలేక జనం అల్లాడిపోతున్నారు. ఇక ఉత్తరాది రాష్ట్రాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్‌కిపైగా చేరుకున్నాయి. అధిక ఉష్ణోగ్రతలకు తట్టుకోలేక జనం పిట్టల్లా రాలిపోతున్నారు..

Watch Video: ఎండలకు పిట్టల్లా రాలిపోతున్న జనాలు.. మృతదేహాలతో కిక్కిరిసిపోతున్న మార్చురీలు!
Lala Lajpat Rai Hospital
Srilakshmi C
|

Updated on: Jun 02, 2024 | 4:34 PM

Share

లక్నో, జూన్‌ 2: నిన్నమొన్నటి వరకు వాన జల్లులు ఆడపాదడపా కురిసినా మళ్లీ భానుడు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాడు. దీంతో దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలకు తట్టుకోలేక జనం అల్లాడిపోతున్నారు. ఇక ఉత్తరాది రాష్ట్రాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్‌కిపైగా చేరుకున్నాయి. అధిక ఉష్ణోగ్రతలకు తట్టుకోలేక జనం పిట్టల్లా రాలిపోతున్నారు. వడదెబ్బ బారినపడి మరణించిన వారి మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తీసుకురావడంతో మార్చురీలు నిండిపోతున్నాయి. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. గత రెండు రోజుల్లో అక్కడ 60 మందికిపైగా మరణించారు. వీరిలో చాలా వరకు అనుమానాస్పదంగా మృతి చెందారు.

దీంతో లాలా లజ్‌పత్ రాయ్ ప్రభుత్వ ఆసుపత్రుల్లోని పోస్ట్‌మార్టం గదికి మృతదేహాలను భారీగా తీసుకొచ్చారు. గదంతా నిండిపోవడంతో కొన్ని మృతదేహాలను గది బయట వేడి వాతావరణంలో ఉంచారు. లోపల కేవలం 4 ఫ్రీజర్‌లు మాత్రమే ఉన్నాయి. స్థలం లేకపోవడంతో మృతదేహాలను నేలపై ఉంచారు. తగినంత ఎయిర్ కండిషనింగ్‌ లేకపోవడంతో మృతదేహాలు వేగంగా కుళ్లిపోతున్నాయి. ఫలితంగా ఆస్పత్రికి 300 మీటర్ల వరకు దుర్వాసన వ్యాపిస్తుంది. ఇదిలాఉంటే.. శుక్రవారం మృతదేహాలకు పోస్ట్‌మార్టం చేస్తున్న ఇద్దరు డాక్టర్లు తీవ్రమైన పరిస్థితుల కారణంగా స్పృహతప్పి పడిపోయారు. ఆస్పత్రిలోని మృతదేహాల నుంచి వస్తున్న దుర్వాసన అటు వైద్యులతోపాటు బంధువులు కూడా ఇబ్బందులు పడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మార్చురీలో పెరిగిపోతున్న మృతదేహాల అంశంపై అధికారులు స్పందించారు. క్లెయిమ్‌ చేయని మృతదేహాల గురించి వివిధ పోలీసు స్టేషనుల నుంచి ఇంకా సమాచారం సేకరిస్తున్నామని, కచ్చితమైన గణాంకాలను అందించడం కష్టతరంగా మారిందని జాయింట్‌ కమీషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ హరిశ్‌చంద్ర తెలిపారు. అనేక మరణాలు హీట్‌స్ట్రోక్, వడదెబ్బ కారణంగా సంభవించి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనావేస్తున్నారు. పరిస్థితిని అంచనా వేయడానికి అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ (ADM), Chief Medical Officer (CMO)ని జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.