Jallikattu: జోరుగా ‘జల్లికట్టు’ పోటీలు.. పలువురుకి గాయాలు.. ఒకరు మృతి.. పోలీసులు భారీ బందోబస్త్..

Jallikattu: తమిళనాడు (Tamilnadu) లో సంక్రాంతి పండగ సందర్భంగా జరిగే సాంప్రదాయ క్రీడ ' జల్లికట్టు' లో పెను ప్రమాదం జరిగింది. తాడులో చిక్కుకున్న వ్యక్తిని ఎద్దు చాలా దూరం ఈడ్చుకెళ్లడంతో..

Jallikattu: జోరుగా 'జల్లికట్టు' పోటీలు.. పలువురుకి గాయాలు.. ఒకరు మృతి.. పోలీసులు భారీ బందోబస్త్..
Jallikattu Competition
Follow us

|

Updated on: Jan 16, 2022 | 12:00 PM

Jallikattu: తమిళనాడు (Tamilnadu) లో సంక్రాంతి పండగ సందర్భంగా జరిగే సాంప్రదాయ క్రీడ ‘ జల్లికట్టు’ లో పెను ప్రమాదం జరిగింది. తాడులో చిక్కుకున్న వ్యక్తిని ఎద్దు చాలా దూరం ఈడ్చుకెళ్లడంతో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మకర సంక్రాంతి(Pongal) సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ‘జల్లికట్టు’ (Jallikattu)క్రీడలను నిర్వహిస్తారు. ఎద్దులను లొంగదీసుకోవడం ఈ ఆటలో ముఖ్యాంశం. ఈ సాంప్రదాయ క్రీడ జల్లికట్టు ఏళ్ల తరబడి కొనసాగుతోంది. తాజాగా సంక్రాంతి సందర్భంగా వేలూరు జిల్లాలో కూడా జల్లికట్టు నిర్వహిస్తున్నారు. పరిగెత్తుతున్న ఎద్దును ఓ వ్యక్తీ అదుపు చేస్తున్నప్పుడు.. ఆ వ్యక్తి తాళ్ళకు చిక్కుకున్నాడు. దీంతో అతడిని ఎద్దు చాలా దూరం వరకు ఈడ్చుకుని వెళ్ళింది.

స్థానికులు రక్షింఛి.. క్షతగాత్రుడిని వెంటనే ఆసుపత్రిలో చేర్చారు. అదేవిధంగా తిరుపత్తూరు ప్రాంతంలో కూడా ఎద్దుల పందాలు పోటీలు జరుగుతున్నాయి. ఈ ‘జల్లికట్టు’ కార్యక్రమంలో ఎద్దు ప్రజలపైకి వచ్చి చాలా మందిని గాయపరిచింది. పొంగల్ తొలి రోజైన శుక్రవారం అవనియాపురంలో ‘జల్లికట్టు’ తొలి పోటీని నిర్వహించడం గమనార్హం. ఇందులో చాలా ఎద్దులు పాల్గొన్నాయి. అవనియాపురంలో జల్లి కట్టుని చూడానికి వచ్చిన ఓ 18 ఏళ్ల యువకుడిపై ఎద్దు దాడి చేసింది. దీంతో ఆ యువకుడు అక్కడకక్కడే మృతి చెందాడు. ఈ నేపథ్యంలో పాలమేడులో నిర్వహించే జల్లికట్టుకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో తమిళనాడు ప్రభుత్వం SOP జారీ చేసింది. దీని ప్రకారం సిటింగ్ కెపాసిటీలో 50 శాతం మాత్రమే ఉండాలి. పరిమిత సంఖ్యలో మాత్రమే జల్లి కట్టు చూడడానికి హాజరయ్యేందుకు అనుమతినిచ్చింది. కోవిడ్ మార్గదర్శకంలో భాగంగా ఆట సమయంలో ప్రభుత్వం 150 మంది ప్రేక్షకులను మాత్రమే అనుమతించింది. ఇది కాకుండా, పండుగకు హాజరయ్యే వారు కరోనా వ్యాక్సిన్ లేదా RT-PCR పరీక్ష నివేదిక రెండింటినీ తీసుకోని హాజరు కావాల్సి ఉంది. ముఖ్యంగా RT-PCR టెస్ట్ రిపోర్ట్ 48 గంటల కంటే ఎక్కువ సమయం ఉండకూడదు.

2014లో సుప్రీంకోర్టు నిషేధం: జల్లు కట్టు క్రీడలో ఎద్దులను హింసిస్తున్నారంటూ అనేక ఫిర్యాదులు రావడంతో 2014లో సుప్రీంకోర్టు నిషేధించింది. 2017లో, తమిళనాడు ప్రభుత్వం “సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించడానికి.. దేశీయ ఎద్దుల ఉనికి కాపాడడానికి “జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం, 1960ని సవరించి.. ఒక చట్టాన్ని రూపొందించింది. ఆ తర్వాత ‘జల్లికట్టు’ నిర్వహణపై నిషేధం కూడా ముగిసింది.

Also Read:  ఈ ఒక్క పండు చాలు మధుమేహం నుంచి మిమ్మల్ని కాపాడడానికి.. ముఖ్యంగా టైప్ 2 షుగర్ పేషెంట్స్ కు దివ్య ఔషధం