అంబానీ ఇంటివద్ద సెక్యూరిటీ ముప్పు కేసు, పోలీసు అధికారిని అరెస్ట్ చేయాలన్న ఫడ్నవీస్

| Edited By: Anil kumar poka

Mar 09, 2021 | 7:21 PM

ముంబైలో పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ ఇంటివద్ద సెక్యూరిటీ ముప్పు కేసు మెల్లగా రాజకీయ రంగు సంతరించుకుంటోంది. ఇటీవల అక్కడ అనుమానాస్పద...

అంబానీ ఇంటివద్ద సెక్యూరిటీ ముప్పు కేసు, పోలీసు అధికారిని అరెస్ట్ చేయాలన్న ఫడ్నవీస్
Follow us on

ముంబైలో పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ ఇంటివద్ద సెక్యూరిటీ ముప్పు కేసు మెల్లగా రాజకీయ రంగు సంతరించుకుంటోంది. ఇటీవల అక్కడ అనుమానాస్పద వాహనంలో  పేలుడు పదార్థాలు ఉండడం, ఆ వాహన యజమానిగా చెబుతున్న హీరేన్ మాన్ సుఖ్ అనే వ్యక్తి మరణం తదితరాలకు సంబంధించిన కేసు కొత్త  మలుపు  తిరిగింది. మాన్ సుఖ్ ది  సహజ మరణమని పోలీసులు చెబుతుండగా.. ఇది హత్యేనని,   సచిన్ వాజే అనే పోలీసు అధికారి వేధింపులే తన భర్త మృతికి కారణమని అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త మరణానికి రెండు రోజుల ముందు తనను పోలీసులు వేధిస్తున్నారని తనతో చెప్పాడని ఆమె అన్నారు. ఈ స్టేట్ మెంట్ ఆధారంగా  పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ వ్యవహారం మంగళవారం మహారాష్ట్ర అసెంబ్లీ లో  తీవ్ర చర్చకు దారి తీసింది. మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఈ ఎఫ్ ఐ ఆర్ కాపీని సభలో చదువుతూ సచిన్ వాజే అనే ఆ పోలీసు అధికారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అతడిని శిక్షించాలని, ఒక పార్టీకి చెందినవాడైనందున అతడిని  రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. అతడిని మొదట సస్పెండ్ చేయాలన్నారు.

మహారాష్ట్ర హోం మంత్రి దీనిపై స్పందిస్తూ మీరు సీఎంగా ఉండగా ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్ సూసైడ్ కేసును దర్యాప్తు చేయలేదని, దాన్ని తొక్కిపెట్టారని ఆరోపించారు. హిరేన్ మాన్ సుఖ్ భార్య స్టేట్ మెంట్ మీడియా వద్ద కూడా ఉందని, ఈ కేసును ఏటీఎస్ ఇన్వెస్టిగేట్ చేస్తోందని ఆయన చెప్పారు. ప్రతిపక్షం వద్ద ఏవైనా ఆధారాలు ఉంటే వాటిని ఈ దర్యాప్తు సంస్థకు అందజేయవచ్ఛు అన్నారు.  ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు.  ప్రస్తుతం మహారాష్ట్రలో బీజేపీ విపక్షంగా ఉంది.

మరిన్ని చదవండి ఇక్కడ :

Jharkhand: అసెంబ్లీకి గుర్రంపై వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే.. నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో..!

‘చావు కబురు చల్లగా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సందడి చేయనున్న బన్నీ:Chaavu Kaburu Challaga Pre Release Event LIVE Video