దగా పడుతున్న రైతన్న, స్వరాజ్ ఇండియా నేత యోగేంద్ర యాదవ్ స్టడీలో వెల్లడైన వైనం

వివాదాస్పద రైతుచట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఆందోళన చేస్తున్న రైతు సంఘాలతో బాటు తాము కూడా నిరసనల్లో పాల్గొంటున్నారు స్వరాజ్ ఇండియా నేత యోగేంద్ర యాదవ్..

దగా పడుతున్న రైతన్న, స్వరాజ్ ఇండియా నేత యోగేంద్ర యాదవ్ స్టడీలో వెల్లడైన వైనం
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Mar 09, 2021 | 7:51 PM

వివాదాస్పద రైతుచట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఆందోళన చేస్తున్న రైతు సంఘాలతో బాటు తాము కూడా నిరసనల్లో పాల్గొంటున్నారు స్వరాజ్ ఇండియా నేత యోగేంద్ర యాదవ్.. ఏపీఎంసీ చట్టం, కనీస మద్దతుధర తదితర అంశాలపై స్టడీ చేసేందుకు ఇటీవల ఆయన కర్నాటక లోని కలబుర్గీ జిల్లాను సందర్శించారు. ఈ జిల్లా కంది పంటకు పెట్టింది పేరు. ముఖ్యంగా నవంబరు..డిసెంబర్..జనవరి..ఫిబ్రవరి  మధ్య  ఇక్కడికి నాణ్యమైన కందిపప్పు పంట వస్తుంది. ప్రతి ఏడాది దాదాపు 45 లక్షల క్వింటాళ్ల పంట వస్తే గత  ఏడాది వరదల కారణంగా ఈ సారి 25 లక్షల క్వింటాళ్ల పంట  మాత్రమే వచ్చింది. తమ ఉత్పత్తులను  ప్రభుత్వమే కొనాలని కోరేందుకు మొదట  మొహమాట పడిన రైతులు ఆ తరువాత చేసేది లేక  ఇలా కోరక తప్పలేదు.  దీంతో ప్రభుత్వం 176 ప్రొక్యూర్ మెంట్ సెంటర్లను తెరిచింది. వీటిలో 48 వేల మందికి పైగా రైతులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అయితే కందిపప్పు ధరలు పెరిగిపోవడంతో చాలామంది తమ కంది ఉత్పత్తులను ఈ కేంద్రాల బయట అమ్ముతూ వచ్చారు. ఈ పంట క్వింటాలు 6 వేల  రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించగా వీరు ఆరున్నర వేల నుంచి 7 వేల  రూపాయలకువిక్రయించడం ప్రారంభించారు.

ఇటీవల ఈ జిల్లాను  విజిట్ చేసిన యోగేంద్ర యాదవ్.. ఆయన టీమ్ ఇది చూసి ఆశ్చర్యపోయారు. నిజానికి క్వింటాళ్లకు రూ. 7650 ఉండాలని స్వామినాథన్ కమిషన్ సిఫారసు చేయగా ఈ రైతులు అంకంటే తక్కువగానే..అంటే 7 వేల రూపాయలకే అమ్ముతున్నారని ఆయన కనుగొన్నారు. మొత్తానికి రైతుకు నష్టమే జరుగుతోందన్న విషయం ఆయనకు అర్థమయింది. రైతుని మోసగిస్తున్నారని ఆయన నిర్ధారణకు వచ్చారు.

Latest Articles