Sasikala: దాదాపు నాలుగేళ్ల తరువాత స్వేచ్ఛా వాయులు పీల్చిన అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ.. వస్తూనే రాష్ట్రంలో రాజకీయంగా సంచలనం సృష్టించారు. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న ఆవిడ.. ఆదివారం నాడు బెంగళూరు విక్టోరియా ఆస్త్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా శశికళ ప్రత్యేక వాహనంలో ఇంటికి బయలు దేరారు. అయితే, ఇప్పుడు ఆ వాహనమే చర్చనీయాంశంగా మారింది. శశికళ ప్రయాణించిన కారుకు అన్నాడీఎంకే పార్టీ జెండా ఉంది. ఆ జెండానే ఇప్పుడు అనేక సందేహాలకు తావిస్తోంది.
దివంగత నాయకురాలు జయలలిత బ్రతికి ఉన్నంతకాలం ఓ వెలుగు వెలిగిన శశికళ.. 2016 వరకు అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీగా ఉన్నారు. అయితే జయలలిత మరణం తరువాత కూడా పార్టీ మొత్తాన్ని తన అదుపాజ్ఞల్లో ఉంచుకున్నారు. ఆయితే ఆ తరువాత చోటుచేసుకున్న నాటకీయ రాజకీయ పరిణామాల నేపథ్యంలో మెజార్టీ సభ్యుల తీర్మానంతో ఆమెను పార్టీ నుంచి బహిష్కరించారు. అయితే తాజాగా ఆమె ప్రయాణించిన కారుకు అన్నాడీఎంకే పార్టీ జెండా ఉండటంతో రకరకాల ఊహాగానాలు ప్రారంభం అయ్యాయి. పార్టీని మళ్లీ తన గ్రిప్‌లో తెచ్చుకుంటానని పరోక్షంగా సంకేతాలు పంపేందుకే ఆమె కారుకు అన్నాడీఎంకే జెండాను పెట్టారనే ప్రచారం జరుగుతోంది. తాజా పరిణామంతో శశికళ మళ్లీ నాటి వైభవాన్ని పొందుతారా? తిరిగి పార్టీపై పట్టు సాధిస్తారా? ఆ దిశగా శశికళ ప్రయత్నాలు మొదలు పెట్టారా? త్వరలోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమె ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు? అంటూ రకరకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
అక్రమాస్తుల కేసులో 2017లో అరెస్టయిన శశికళకు కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. కోర్టు తీర్పు ప్రకారం.. శశికళ బెంగళూరులోని పరప్పన అగ్రహారం జైలు శిక్ష అనుభవించారు. ఈ నెల 27వ తేదీతో ఆమె శిక్షా కాలం పూర్తయ్యింది. దాంతో ఆమె జైలు నుంచి విడుదలయ్యారు. కాగా, జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలోనే శశికళకు కరోనా సోకింది. దాంతో ఆమెను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స నందించారు. పది రోజులు పాటు చికిత్స అనంతరం ఆమెకు కరోనా నెగిటివ్ అని తేలింది. శశికళ ఆరోగ్యం కూడా మెరుగు పడింది, ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవ్వొచ్చిన వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో ఆమె.. ఇవాళ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. కాగా, శశికళ ఫిబ్రవరి 8వ తేదీన చెన్నై వెళతారని ఆమె అనుచర వర్గాల సమాచారం. ఇదిలాఉంటే, శశికళ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన సందర్భంగా ఆభిమానులు పెద్ద ఎత్తున విక్టోరియా ఆస్పత్రి వద్దకు తరలి వచ్చారు.
Sasikala Discharge from Hospital:
#WATCH | Expelled AIADMK leader VK Sasikala discharged from Victoria Hospital in Bengaluru, Karnataka.
She was admitted to the hospital with the complaint fever last week and was later diagnosed with COVID-19. pic.twitter.com/AyapUI4Y1T
— ANI (@ANI) January 31, 2021
Also read:
sonu sood: సుప్రీంకోర్టును ఆశ్రయించిన సోనూసూద్… భవనాన్ని కూల్చకుండా అడ్డుకోవాలని పిటిషన్…
MLA Challa Dharmareddy : హన్మకొండలో హై టెన్షన్.. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వ్యాఖ్యలపై దుమారం..