Reservation: వారికి కూడా అవకాశం.. రిజర్వేషన్.. అంతేకాదు ఇక అక్కడ పోలీసులుగా..

|

Dec 22, 2021 | 8:37 AM

వారికి కూడా అవకాశం ఇవ్వండి. వారికి కూడా రిజర్వేషన్ కల్పించండి. ఓ సేవా సంస్థ వేసిన పిటిషన్‌ విజయం సాధించింది. ప్రభుత్వ కార్పొరేషన్లు, మండలి, సంస్థల్లో..

Reservation: వారికి కూడా అవకాశం.. రిజర్వేషన్.. అంతేకాదు ఇక అక్కడ పోలీసులుగా..
Police Invite Applications
Follow us on

Reservation Karnataka: వారికి కూడా అవకాశం ఇవ్వండి. వారికి కూడా రిజర్వేషన్ కల్పించండి. ఓ సేవా సంస్థ వేసిన పిటిషన్‌ విజయం సాధించింది. ప్రభుత్వ కార్పొరేషన్లు, మండలి, సంస్థల్లో ట్రాన్స్‌జెండర్లకు (ట్రాన్స్‌జెండర్‌) ఒక శాతం రిజర్వేషన్‌ వర్తింప చేయాలని కర్నాటక సర్కార్‌ను ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. చర్యల కోసం ప్రభుత్వానికి రెండు వారాల అవకాశాన్నిచ్చింది. లైంగిక అల్పసంఖ్యాకుల సంక్షేమం కోసం శ్రమిస్తున్న ‘సంగమ స్వయం సేవా సంస్థ’ దాఖలు చేసిన ప్రజా ప్రయోజనాల పిల్‌పై విచారణ పూర్తి చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రితురాజ్‌ అవస్థి నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది.

కేవలం ప్రభుత్వ ఉద్యోగాలకు మాత్రమే ఈ ఆదేశాలు వర్తిస్తాయని పేర్కొంది. మరోవైపు పోలీసు రిక్రూట్‌మెంట్‌-2021 కోసం ఇచ్చిన నోటిఫికేషన్‌లో ప్రత్యేక రిజర్వు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు ట్రాన్స్‌జెండర్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని కర్ణాటక పోలీసుశాఖ ప్రకటించింది.

కోర్టు ఆదేశాలతో ఒక మైలురాయి చర్యగా, పోలీసు శాఖ కర్ణాటక స్టేట్ రిజర్వ్ పోలీస్ (KSRP) ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ (IRB)లో స్పెషల్ రిజర్వ్ సబ్-ఇన్‌స్పెక్టర్ పోస్టుల కోసం ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ సభ్యుల నుండి దరఖాస్తులను ఆహ్వానించింది.

కోర్టు ఆదేశాలను అనుసరించి.. కర్ణాటక ప్రభుత్వం ప్రత్యక్ష నియామక ప్రక్రియ ద్వారా భర్తీ చేయడానికి అన్ని కేటగిరీల ఉద్యోగాలలో ఏదైనా సేవ లేదా పోస్ట్‌లో ట్రాన్స్‌జెండర్లకు 1 శాతం రిజర్వేషన్‌ను పొడిగిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.

ఇవి కూడా చదవండి: Phone Tapping: మళ్ళీ చర్చలో ఫోన్ ట్యాపింగ్ అంశం.. అసలు ఇదేమిట్? ప్రభుత్వం ఎవరి ఫోన్ అయినా ట్యాప్ చేయగలదా?

Go Air: గో ఎయిర్ బంపర్ ఆఫర్.. వ్యాక్సిన్ వేసుకున్నవారికి 20 శాతం డిస్కౌంట్..