రైతు చట్టాలపై రభస, వారిది పథకం ప్రకారమే వ్యూహం, విపక్షాలపై ప్రధాని మోదీ ఆగ్రహం

| Edited By: Anil kumar poka

Feb 10, 2021 | 8:00 PM

రైతు చట్టాలపై పథకం ప్రకారమే విపక్షాలు సభలో నినాదాలు చేస్తూ రభస చేస్తున్నాయని, నిరసనకు దిగాయని ప్రధాని మోదీ ఆరోపించారు. ఇది పథకం ప్రకారమే జరిగిందన్నారు.

రైతు చట్టాలపై రభస, వారిది పథకం ప్రకారమే వ్యూహం, విపక్షాలపై ప్రధాని మోదీ ఆగ్రహం
Follow us on

రైతు చట్టాలపై పథకం ప్రకారమే విపక్షాలు సభలో నినాదాలు చేస్తూ రభస చేస్తున్నాయని, నిరసనకు దిగాయని ప్రధాని మోదీ ఆరోపించారు. ఇది పథకం ప్రకారమే జరిగిందన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ ఆయన.. రైతు చట్టాలను పూర్తిగా సమర్థించారు. అన్నదాతల బాగుకోసమే ఈ చట్టాలను తెచ్చామని, ఈ రోజు శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిని ‘ఆందోళనజీవులు’ భంగ పరుస్తున్నారని ఆరోపించారు. ఈ చట్టాలపై కాంగ్రెస్ పార్టీలో అయోమయం నెలకొందన్నారు. ఇది డివైడెడ్ పార్టీ..ఆ స్థాయికి దిగజారిపోయింది’ అన్నారు. ఈ తేడాను మనం గమనించాలని,  నక్సలైట్లు, ఉగ్రవాదుల పోస్టర్లను, జైళ్లల్లో ఉన్నవారి పోస్టర్లను పట్టుకుని వీరు ప్రదర్శనలు చేస్తున్నారని మోదీ పేర్కొన్నారు. ఇది రైతుల ప్రయోజనాలకు హానికరం కాదా అని ప్రశ్నించారు. అకాలీదళ్ కు చెందిన హర్ సిమ్రత్ కౌర్ బాదల్ ను ఉద్దేశించి ఆయన పరోక్షంగా ఈ విమర్శ చేశారు. మోదీ ప్రభుత్వం నుంచి మంత్రిపదవికి రాజీనామా చేసిన ఈ ఎంపీ నిన్న పార్లమెంటులో రైతు చట్టాలపై ఉద్వేగంగా ప్రసంగించారు.

ఇలా ఉండగా…. రైతుల ఆందోళన గురించి, నిరసన చేస్తున్నవారిలో కొందరిమరణాల గురించి ప్రధాని చర్చించలేదని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి ఆరోపించారు. ప్రతివారికీ ప్రయోజనం కాని చట్టాలను మీరెందుకు తెస్తారని ఆయన అన్నారు. తమ నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యాన కాంగ్రెస్ సభ్యులంతా సభ నుంచి వాకౌట్ చేశారు. తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు కూడా ఇలాగే స్పందించి నిష్క్రమించారు.

Read More:Covid-19 Pandemic: కరోనావైరస్ సమయంలో గర్భం ధరించడానికి ప్రయత్నిస్తున్న జంటల సమస్యకు జింక్ అత్యుత్తమ పరిష్కారం

Read More:క్రికెట్ లెజెండ్ కి మేమంతా అండ, సచిన్ టెండూల్కర్ ఇంటి వద్ద అభిమానుల కోలాహలం