క్రికెట్ లెజెండ్ కి మేమంతా అండ, సచిన్ టెండూల్కర్ ఇంటి వద్ద అభిమానుల కోలాహలం

రైతుల నిరసనలపై క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ చేసిన ట్వీట్స్ కి గాను ఆయనపై విమర్శలు వెల్లువెత్తిన వేళ.. వందలాది అభిమానులంతా బుధవారం ముంబైలోని..

క్రికెట్ లెజెండ్ కి మేమంతా అండ, సచిన్ టెండూల్కర్ ఇంటి వద్ద అభిమానుల కోలాహలం
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Feb 10, 2021 | 8:36 PM

రైతుల నిరసనలపై క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ చేసిన ట్వీట్స్ కి గాను ఆయనపై విమర్శలు వెల్లువెత్తిన వేళ.. వందలాది అభిమానులంతా బుధవారం ముంబైలోని  ఆయన ఇంటివద్ద గుమికూడారు. మీకు మేమంతా అండ అని వారు ప్రకటించారు. సచిన్ చిత్రంతో కూడిన ప్లకార్డులు, పోస్టర్లను చేత ధరించిన వీరు ఉదయం నుంచే అక్కడికి చేరుకున్నారు. రైతుల నిరసనలపై విదేశీ శక్తులు కేవలం ప్రేక్షక పాత్ర వహించాలని, వారు పార్టిసిపెంట్స్ కాదని, భారత అంతర్గత వ్యవహారాల్లో వీరు తలదూర్చరాదని సచిన్ ఇటీవల ట్వీట్ చేశాడు. పాప్ స్టార్ రిహానా, క్లైమేట్ చేంజ్ యాక్టివిస్ట్ గ్రెటా థన్ బెర్గ్ వంటివారు ట్వీట్స్ చేసిన అనంతరం ఈ క్రికెటర్ కూడా ఇలాగే స్పందించాడు. అయితే ఇందుకు అనేకమంది సోషల్ మీడియాలో, బయట కూడాఆ ఆయనపై విమర్సనాస్త్రాలు సంధించారు. కేంద్రానికి మద్దతుగా ఈ ‘భారత రత్న’ పలుకుతున్నాడని ఎద్దేవా చేశారు.

అటు-క్రికెట్ ని కాకుండా ఇతర అంశాలపై మీ అభిప్రాయాలను తెలియజేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఎన్సీపీ నేత శరద్ పవార్ సైతం సున్నితంగా సచిన్ కి సలహా ఇచ్చారు. ఇది సచిన్ కి ఒక విధంగా గట్టి సూచనే అని భావిస్తున్నారు.

Read More:‘దేవుళ్ళ మాదిరి రథయాత్రలు చేస్తున్నారు’, బీజేపీ నేతలపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపాటు

Read More:రైతుల నిరసనలపై 500 ఖాతాలను మూసేసిన ట్విటర్, భారత ప్రభుత్వంతో సహకరిస్తామని హామీ