PM Modi: 108 అడుగుల హనుమాన్‌ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని నరేంద్ర మోడీ

|

Apr 16, 2022 | 8:03 AM

PM Modi: దేశ వ్యాప్తంగా హనుమాన్‌ జయంతి వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తు్న్నారు...

PM Modi: 108 అడుగుల హనుమాన్‌ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని నరేంద్ర మోడీ
Follow us on

PM Modi: దేశ వ్యాప్తంగా హనుమాన్‌ జయంతి వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే హనుమాన్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) శనివారం గుజరాత్‌ (Gujarat)లో పర్యటించనున్నారు. మోర్బీలో ఏర్పాటు చేసిన 108 అడుగుల భారీ హనుమాన్ విగ్రహాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరిస్తారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. హనుమాన్జీ 4 ధామ్ ప్రాజెక్ట్‌లో భాగంగా దేశ నలు దిక్కుల్లో నాలుగు హనుమాన్ విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే.

అయితే దేశానికి పడమర దిక్కున ఉన్న మోర్బీలోని బాపూ కేశ్వానంద్ ఆశ్రమంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఏర్పాటు చేసిన విగ్రహాల్లో ఇది రెండవది. ఇక మొదటి విగ్రహాన్ని 2010లో ఉత్తరాదిన ఉన్న సిమ్లాలో ఏర్పాటు చేశారు. అలాగే దక్షిణ దిక్కున తమిళనాడులోని రామేశ్వరంలో విగ్రహానికి సంబంధించిన పనులు ప్రారంభించారు.

ఎత్తయిన ప్రదేశంలో ఏర్పాటైన అత్యంత ఎత్తయిన విగ్రహంగా రికార్డు నెలకొల్పింది. జాఖూలోని విగ్రహానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. దీని కోసం మొత్తం 1500 టన్నుల కాంక్రీట్‌, ఇనుము, రాళ్ళు ఉపయోగించారు. సిమ్లాలోని జాఖూలో బిగ్‌-బి అమితాబ్‌ బచ్చన్‌ అల్లుడు నందా నిర్మించిన హనుమాన్‌ విగ్రహం ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లోనూ చోటు సంపాదించుకున్న విషయం తెలిసిందే.

విగ్రహం కోసం 178 అడుగుల లోతు పునాది:

విగ్రహం స్థిరంగా ఉండేందుకు 178 అడుగుల లోతుతో పునాది వేశారు. ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేయడానికి కారణం కూడా ఉంది. లక్ష్మణుడు మూర్ఛ పోయినప్పుడు హనుమంతుడు ఇక్కడే విశ్రాంతి తీసుకున్నాడని చరిత్ర చెబుతోంది. అందుకే అంత భారీ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు.

 


ఇవి కూడా చదవండి:

Russia – Ukraine War: పుతిన్‌కు ఆగ్రహం కలిగించిన ఆ ఘటన.. సైన్యానికి కీలక ఆదేశాలు జారీ..!

Headache: ఉదయం తలనొప్పి వస్తుందా? తేలికగా తీసుకోకండి, ఇది ప్రమాదకరమైన జబ్బు లక్షణం కావొచ్చు..!