Raksha Bandhan: ప్రధాని మోడీకి రాఖీ పంపిన పాక్‌ సోదరి.. రాబోయే ఎన్నికల్లో విజయం సాధించాలంటూ..

| Edited By: Team Veegam

Aug 10, 2022 | 6:27 PM

Raksha Bandhan 2022: అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్‌ పండగ మరికొన్ని రోజుల్లో రానుంది. ఈనేపత్యంలో ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా పాకిస్తాన్‌కు చెందిన కమార్‌ మోహ్సీన్‌ షేక్‌ ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi)కి రాఖీ పంపించారు

Raksha Bandhan: ప్రధాని మోడీకి రాఖీ పంపిన పాక్‌ సోదరి.. రాబోయే ఎన్నికల్లో విజయం సాధించాలంటూ..
Pm Narendra Modi
Follow us on

Raksha Bandhan 2022: అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్‌ పండగ మరికొన్ని రోజుల్లో రానుంది. ఈనేపత్యంలో ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా పాకిస్తాన్‌కు చెందిన కమార్‌ మోహ్సీన్‌ షేక్‌ ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi)కి రాఖీ పంపించారు. రాబోయే 2024 ఎన్నికల్లో ఆయన విజయం సాధించాలని మోహ్సీన్‌ ఆకాంక్షించారు. ఈ రాఖీ పండగ సందర్భంగా పీఎం మోడీని కలిసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నానని ఆమె పేర్కొన్నారు. కాగా రాఖీని రేష్మి రిబ్బన్‌, ఎంబ్రాయిడరీ డిజైన్స్‌ తో తానే డిజైన్‌ చేసినట్లు పాక్‌ సోదరి తెలిపారు. ఈసారి ప్రధాని మోడీ తనను ఢిల్లీ పిలుస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా రాఖీతో పాటు ఓ లేఖను కూడా మోడీకి పంపించారు మోహ్సీన్‌.

‘ప్రధాని మోడీ ఆరోగ్యంగా, నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటున్నా. ఇప్పుడు చేస్తున్నట్లు గానే ముందు ముందు మరిన్ని మంచి పనులు కొనసాగించాలి. 2024లో మళ్లీ మోడీనే ప్రధాని అవుతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఆయనకు ఆ సామర్థ్యం ఉంది. ప్రతిసారి మోడీనే పీఎంగా ఉండాలి’ అని ఆ లేఖలో మోహ్సీన్‌ పేర్కొన్నారు. కాగా కమార్‌ మోహ్సీన్‌ షేక్‌ పాకిస్తాన్‌కు చెందిన మహిళ. ఆమె ఇలా ప్రధాని మోడీకి రాఖీలు కట్టడం, పంపించడం ఇదేమీ మొదటిసారి కాదు. ప్రధాని మోడీ స్వయం సేవక్ సంఘ్ లో ఉన్నప్పటి నుంచే కమర్ మోహ్సీన్ షేక్ కు తెలుసు. అప్పటి నుంచే పలుసార్లు పీఎంకు రాఖీలు పంపిస్తూ ఉన్నారు.

మరిన్ని జాతీయవార్తల కోసం క్లిక్ చేయండి..