PM Narendra Modi Kedarnath visit: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రోజు చార్‌ధామ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మంచ్‌దార్‌లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ఉదయాన్నే ప్రధాని మోదీ కేదార్నాథ్ ఆలయానికి పయనమయ్యారు. ఆలయంలో ప్రత్యేక ప్రార్థనల అనంతరం మోదీ కొత్తగా నిర్మించిన సద్గురు ఆది శంకరాచార్యుల సమాధిని ప్రారంభిస్తారు. అనంతరం ఆదిశంకరాచార్యుల విగ్రహాన్ని కూడా ఆవిష్కరించనున్నారు. అంతేకాకుండా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు కూడా చేయనున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం 6.30 గంటలకు ఉత్తరాఖండ్ చేరుకుంటారని, అక్కడినుంచి కేథర్నాత్ పయనమవుతారని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని కొత్తగా నిర్మించిన ఆది శంకరాచార్యుల సమాధి, విగ్రహంతోపాటు సరస్వతి ఘాట్, 130 కోట్ల ఇన్ఫ్రా ప్రాజెక్టులను ప్రారంభిస్తారని ధామి తెలిపారు. దీంతోపాటు కేదార్నాథ్ ఆలయ ప్రాంగంణంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను కూడా ప్రధాని ప్రారంభించనున్నారు.
Preparations underway at Kedarnath shrine in Uttarakhand ahead of PM Narendra Modi’s visit today. PM will offer prayers at the shrine, inaugurate Adi Shankaracharya Samadhi & unveil their statue. pic.twitter.com/kYd6tz0CuX
— ANI (@ANI) November 5, 2021
Also Read: