Prime Minister Modi: సెకండ్ వేవ్ రూపంలో కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా ఉధృతంగా వ్యాప్తి చెందుతోంది. రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. గతేడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలలో కరోనా కేసులు అధికంగా నమోదు అవగా.. అంతటి స్థాయిలో తాజాగా నమోదు అవుతున్నాయి. తాజాగా ఏకంగా లక్ష కేసులు నమోదు అవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కలవరం మొదలైంది. ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం కరోనా కట్టడికి సంబంధించి రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచనలు, సలహాలు ఇస్తోంది.
ఇక దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి ఉధృతంగా ఉన్న నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ కానున్నారు. ఏప్రిల్ 8వ తేదీన రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి, ప్రస్తుత పరిస్థితులు, కోవిడ్ వ్యాక్సినేషన్, తదితర అంశాలపై ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ చర్చించనున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించనున్నట్లు తెలుస్తోంది. అలాగే కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో లాక్‌డౌన్ విధించడంపైనా చర్చించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
Also read:
బరువు తగ్గడం వలన టైప్ 2 డయాబెటిస్‌ను కంట్రోల్ చేయవచ్చు !! అందుకోసం ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..
West Bengal Election 2021: మమతా గెలిస్తేనే మరింత అభివృద్ధి.. సినీనటి, ఎంపీ జయా బచ్చన్ కీలక వ్యాఖ్యలు
Saggubiyyam Vadiyalu: ఏడాది పాటు నిల్వ ఉండే రుచికరమైన సగ్గు బియ్యం వడియాల తయారీ తెలుసుకుందాం..!