PM Narendra Modi: డ్రీమ్ ప్రాజెక్టును ప్రారంభించనున్న ప్రధాని మోదీ.. నేడు గోరఖ్‌పూర్‌లో పర్యటన..

| Edited By: Anil kumar poka

Dec 23, 2021 | 6:22 PM

Gorakhpur Fertilizer Plant: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రూ.9600 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను జాతికి

PM Narendra Modi: డ్రీమ్ ప్రాజెక్టును ప్రారంభించనున్న ప్రధాని మోదీ.. నేడు గోరఖ్‌పూర్‌లో పర్యటన..
Pm Narendra Modi
Follow us on

Gorakhpur Fertilizer Plant: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రూ.9600 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను జాతికి అంకితం చేయనున్నారు. ఈ ప్రాజెక్టులను యూపీ సీఎం యోగి ఆధిత్యనాధ్‌తో కలసి ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టుల్లో ప్రధాని మోదీ, సీఎం యోగి డ్రిమ్ ప్రాజెక్టు గోరఖ్‌పూర్ ఫెర్టిలైజర్ ప్లాంట్‌ కూడా ఉంది. దీనికి ప్రధాని నరేంద్రమోదీ 2016లో శంకుస్థాపన చేశారు. ఈ ప్లాంట్ రోజుకు 3,850 మెట్రిక్ టన్నుల యూరియాను ఉత్పత్తి చేస్తుంది. గోరఖ్‌పూర్ ఫెర్టిలైజర్ ప్లాంట్‌తో పూర్వాంచల్ రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. దీంతోపాటు ఎయిమ్స్‌లో పూర్తి స్థాయిలో పనిచేసే కాంప్లెక్స్‌ను కూడా ప్రధాని ప్రారంభించనున్నారు. ఈ మేరకు గోరఖ్‌పూర్‌లో భద్రతా బలగాలను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పకడ్భందీగా బందోబస్తు నిర్వహిస్తున్నారు.

నరేంద్ర మోదీ ప్రధాని కావడానికి ముందు.. 2014 జనవరిలో గోరఖ్‌పూర్ ఎరువుల కర్మాగారాన్ని తిరిగి ప్రారంభిస్తానని హామీ ఇచ్చారు. ఈ హామీ ప్రకారం ఈ రోజు ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించనున్నారు. గత 30 ఏళ్లుగా మూతపడిన ఈ ఫ్యాక్టరీని రూ.8600 కోట్లతో పునరుద్ధరించారు. ఫెర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ (FCIL) గోరఖ్‌పూర్ యూనిట్ 1969లో యూరియాను నాఫ్తాతో ఫీడ్‌స్టాక్‌గా ఉత్పత్తి చేయడానికి స్థాపించారు. FCIL నిరంతర నష్టాల కారణంగా జూన్ 1990లో ప్లాంట్‌ను మూసివేశారు. ముఖ్యంగా నాఫ్తా అధిక ధర కారణంగా సాంకేతిక, ఆర్థికపరమైన కార్యకలాపాలు సాధ్యపడలేదు.

రెండు దశాబ్దాలకు పైగా ప్లాంట్ పునరుద్ధరణ డిమాండ్..
ప్లాంట్ పునరుద్ధరణ డిమాండ్ రెండు దశాబ్దాలకు పైగా ఉంది. పూర్వాంచల్ ప్రాంతం పట్ల గత ప్రభుత్వాలు ఉదాసీనతతో వ్యవహరిస్తూ వచ్చాయి. ప్రజలు డిమాండ్‌ చేస్తున్న ఎరువుల కర్మాగారం పునరుద్ధరణకు ఎలాంటి చొరవ తీసుకోలేదు. 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు గోరఖ్‌పూర్‌లో జరిగిన ర్యాలీలో నరేంద్ర మోదీ గోరఖ్‌పూర్‌లోని ఎరువుల కర్మాగారాన్ని మూసివేసే అంశాన్ని లేవనెత్తారు. ప్రధాని అయిన తర్వాత.. మూతపడిన ఎరువుల కర్మాగారం పునరుద్ధరణకు ప్రధాని మోదీ కృషి చేశారు. 2016లో గోరఖ్‌పూర్ ప్లాంట్ పునరుద్ధరణకు శంకుస్థాపన చేశారు. ఈ ప్లాంట్ యూపీలోని పూర్వాంచల్ ప్రాంతం, పొరుగు రాష్ట్రాల రైతులకు యూరియాను సరఫరా చేస్తుంది.

ప్రస్తుతం దేశీయంగా యూరియా ఉత్పత్తి 250 లక్షల టన్నులుగా ఉంది.. ఏటా 350 లక్షల టన్నుల యూరియా డిమాండ్‌ ఉంది. ఈ క్రమంలో దాదాపు 100 లక్షల టన్నుల యూరియాను దిగుమతి చేసుకోవలసి వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు నుంచి సహకారం అందనుంది.

5 ఎరువుల ప్లాంట్లను పునరుద్ధరించిన కేంద్రం..
నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ఐదు ఎరువుల ప్రాజెక్టులను ప్రారంభించింది. బీహార్‌లోని గోరఖ్‌పూర్, బరౌనీ, జార్ఖండ్‌లోని సింద్రీ, తెలంగాణలోని రామగుండం, ఒడిశాలోని తాల్చేర్ ప్లాంట్‌లను పునరుద్ధరించింది. ఈ 5 ప్లాంట్లు దేశంలో మొత్తం యూరియా ఉత్పత్తిని సంవత్సరానికి 6 మిలియన్ టన్నులకు పైగా పెంచగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.

Also Read:

PM Modi Putin Summit: పుతిన్‌తో ప్రధాని నరేంద్రమోదీ భేటీ.. రక్షణ, వాణిజ్య రంగాల్లో కీలక ఒప్పందాలు

Omicron Variant: దేశంలో చాపకింద నీరులా విస్తరిస్తున్న ఒమిక్రాన్.. మరో రెండు కేసులు నమోదు.. ఎక్కడంటే..?